RR Vs Mi IPL 2025: గురువారం నాటి ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గొర్రె మంద సామెతను రాజస్థాన్ రాయల్స్ జట్టు నిజం చేసి చూపించింది. ఇటీవల గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్య వంశీ 200+ స్కోర్ ను ఉఫ్ మని ఊదేశారు. గురువారం ముంబై ఇండియన్స్ పై కూడా ఇదే అద్భుతం సూర్యవంశీ, జైస్వాల్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ వారు ఆ స్థాయిలో ఆడ లేక పోయారు. సెంచరీ హీరో సూర్య వంశీ డక్ ఔట్ అయ్యాడు. జైస్వాల్ 2 సిక్సర్లు కొట్టి..భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. ఇక ఆ తర్వాత రాజస్థాన్ ఆటగాళ్లు రియాన్ పరాగ్, దృవ్ జూరెల్, హిట్ మేయర్, నితీష్ రాణా.. ఇలా వచ్చినవారు వచ్చినట్టు పెవిలియన్ వెళ్లిపోయారు. రాజస్థాన్ బ్యాటర్లలో జోప్రా ఆర్చర్ చేసిన 30 పరుగులే హైయెస్ట్ స్కోర్ అంటే.. ఆ జట్టు బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముంబై బౌలర్లు చెలరేగి బౌలింగ్ వేశారు. బౌల్ట్, కరణ్ శర్మ చెరి మూడు వికెట్లు పడగొట్టారు. బుమ్రా రెండు వికెట్లు సాధించాడు. 16.1 ఓవర్లలోనే రాజస్థాన్ జట్టు 117 పరుగులకు కుప్పకూలడం విశేషం.
Also Read: వైభవ్ సూర్య వంశీ.. విసుగెత్తిపోతున్న గూగుల్.. ఇంతకీ ఏం జరిగిందంటే.
అత్యంత చెత్త రికార్డు
సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ చెత్త రికార్డు నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ జట్టుపై 100 పరుగుల మార్జిన్ తో ఓటమిపాలైంది. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఎక్కువ పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడిపోయిన మ్యాచ్లను ఒకసారి పరిశీలిస్తే..
2023లో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో 112 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ప్రస్తుత సీజన్లో సొంతవేదికలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఎదుట రాజస్థాన్ రాయల్స్ తలవంచింది. ఏకంగా 100 రన్స్ వ్యత్యాసంతో అత్యంత దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది.
2021లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు చేతిలో రాజస్థాన్ రాయల్స్ 86 పరుగుల తేడాతో ఓడిపోయింది.
2009లో కేప్ టౌన్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ దారుణమైన ఓటమి ఎదుర్కొంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో తలపడి రాజస్థాన్ రాయల్స్ 75 రన్స్ వ్యత్యాసంతో పరాజయం పాలయింది.
గ్రూప్ దశ నుంచే..
ఒక దాని తర్వాత ఒకటి ఓటములు ఎదురవుతున్న నేపథ్యంలో రాజస్థాన్ జట్టు కథ ప్రస్తుత ఐపీఎల్ లో ముగిసింది. ఇప్పటికే చెన్నై జట్టు ఎలిమినేట్ అయింది. చెన్నై తర్వాత ఎలిమినేట్ అయిన రెండవ జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. బ్యాటింగ్లో సత్తా చూపించలేక.. బౌలింగ్లో సామర్థ్యాన్ని నిరూపించుకోలేక.. మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ తన పోరాటాన్ని గ్రూప్ దశలోనే ముగించడం గమనార్హం.. రాజస్థాన్ వైఫల్యం ఆ జట్టు అభిమానులను కుంగ దీస్తోంది.
Also Read: నిన్న సెంచరీ..నేడు సున్నా.. పాపం సూర్యవంశీ