Mi Vs RR IPL 2025: ఐపీఎల్ 18 వ ఎడిషన్లో ముంబై ఇండియన్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. గురువారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వంద పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది.
Also Read: వైభవ్ సూర్య వంశీ.. విసుగెత్తిపోతున్న గూగుల్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఈ సీజన్ ను ఓటములతో మొదలు పెట్టిన ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కింది.. ఇప్పటివరకు ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ 11 మ్యాచులు ఆడింది. ఇందులో నాలుగు ఓటములు.. ఏడు విజయాలు ఉన్నాయి.. ముఖ్యంగా గడిచిన ఆరు మ్యాచ్లలో ముంబై ఇండియన్స్ వరుస విజయాలు సాధించి నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. ముంబై ఇండియన్స్ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ +1.274 ఉంది.. ముంబై ఇండియన్స్ తర్వాత స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనసాగుతోంది.. మూడో స్థానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, గుజరాత్ టైటాన్స్ నాలుగో స్థానంలో ఉంది. మొన్నటిదాకా నెంబర్ వన్ స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోవడం విశేషం.
ముంబై సరికొత్త రికార్డు
ఐపీఎల్ చరిత్రలో ముంబై సరికొత్త రికార్డులు సృష్టించింది. 2008లో వరుసగా ఆరు విజయాలు సాధించింది. 2017లో కూడా వరుసగా ఆరు విజయాల సాధించింది. 2025 లో వరుసగా ఆరు విజయాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక వరుసగా ఐదు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచులు గెలిచిన ప్రతి సందర్భంలో ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరుకుంది. అయితే ఈసారి కూడా ముంబై ఇండియన్స్ ఫైనల్స్ చేరుకుంటారని క్రికెట్ విష్ణు శాఖలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక 200 కంటే ఎక్కువ లక్ష్యాలను కాపాడుకొని.. విజయాలు సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్ అవతరించింది. 17 మ్యాచ్లలో ముంబై ఇండియన్స్ 200 పరుగులకు మించి చేసింది. ఆ లక్ష్యాలను కాపాడుకొని విజయాలు సాధించింది. ఇక వరుసగా నాలుగు ఓటముల అనంతరం జైపూర్లో రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. రాజస్థాన్ జట్టు జైపూర్ 2012లో ముంబై ఇండియన్స్ చేతిలో చివరిసారిగా ఓడిపోయింది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత రాజస్థాన్ ముంబై చేతిలో సొంత మైదానంలో ఓటమి ఎదుర్కొంది.
మార్జిన్ల ప్రకారం..
2017లో ఢిల్లీ వేదికగా ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో 146 రన్స్ తేడాతో విజయ పతాక ఎగరేసింది.. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఇదే బిగ్గెస్ట్ విక్టరీ..
ఇక 2018 కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 102 పరుగులతో విజయం సాధించింది. మార్జిన్ పరంగా ముంబై ఇండియన్స్ జట్టుకు ఇది రెండవ అతి భారీ విజయం.
Here’s to a ℙℝ start to the day #MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #RRvMI pic.twitter.com/KsAtURs1z2
— Mumbai Indians (@mipaltan) May 2, 2025
ప్రస్తుతం కొనసాగుతున్న ఐపిఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ 100 రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై టెర్రిఫిక్ విక్టరీ సొంతం చేసుకుంది.
Also Read: నిన్న సెంచరీ..నేడు సున్నా.. పాపం సూర్యవంశీ