Maruti Suzuki : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఏప్రిల్ నెలలో మొత్తం 7 శాతం వృద్ధితో 1,79,791 యూనిట్లను విక్రయించింది. ఈ మేరుకు కంపెనీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది ఇదే నెలలో కంపెనీ మొత్తం 1,68,089 వాహనాలను విక్రయించింది. అయితే, దేశీయంగా ప్యాసింజర్ వాహనాల మొత్తం అమ్మకాలు ఏప్రిల్‌లో స్వల్పంగా పెరిగి 1,38,704 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 1,37,952 యూనిట్లుగా ఉంది.
ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటి చిన్న కార్ల అమ్మకాలు ఏప్రిల్‌లో తగ్గి 6,332 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 11,519 యూనిట్లుగా ఉంది. అయితే, బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వాగన్‌ఆర్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు ఇదే నెలలో పెరిగి 61,591యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 56,953 యూనిట్లుగా ఉంది.
Also Read : ఆరు నెలల్లోనే 94 వేలకు పైగా అమ్మకాలు.. ధర కూడా అంతంతే.. ఈ ఫెవరెట్ కారు గురించి తెలుసుకుందామా?
బ్రెజ్జా, ఎర్టిగా, గ్రాండ్ విటారా, ఎక్స్‌ఎల్6 వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు గత నెలలో 59,022 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ లో ఈ సంఖ్య 56,553 యూనిట్లుగా ఉంది. కంపెనీ గత నెలలో 11,438 ఈకో వ్యాన్‌లను కూడా విక్రయించింది. గతేడాది ఏప్రిల్ లో ఈ సంఖ్య 12,060 యూనిట్లుగా ఉంది. లైట్ కమర్షియల్ వెహికల్ సూపర్ క్యారీ అమ్మకాలు 3,349 యూనిట్లుగా ఉన్నాయి, గతేడాది ఏప్రిల్‌లో ఈ సంఖ్య 2,496 యూనిట్లుగా ఉంది. కంపెనీ గత నెలలో 27,911 యూనిట్లను ఎగుమతి చేసింది. గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 22,160 యూనిట్లుగా ఉంది.
కార్ల తయారీదారు దేశీయ అమ్మకాల్లో స్వల్ప వృద్ధిని సాధించినప్పటికీ, ఎగుమతుల్లో మాత్రం భారీగా పుంజుకుంది. మారుతి సుజుకి ఏప్రిల్ 2025లో 27,911 యూనిట్లను ఎగుమతి చేసింది, గత ఏడాది ఇదే సమయంలో 22,160 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. ఇది ఏడాదికేడాది ప్రాతిపదికన 25.9 శాతం వృద్ధిని సూచిస్తుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు తక్కువగా ఉంటాయని కంపెనీ ముందుగానే తెలిపింది, కానీ మారుతి సుజుకి ఇండియా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి, ఆదాయం రెండింటినీ పెంచడానికి తన ఎగుమతిలపై దృష్టి పెట్టి అందుకు తగ్గ వ్యూహాలను అమలుచేస్తోంది.
2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అనేక ముఖ్యమైన విజయాలు సాధించింది. మొత్తం 332,585 కార్ల ఎగుమతితో మూడు లక్షల ఎగుమతుల మార్క్‌ను దాటింది. ఇది ఒక సంవత్సరం క్రితం 283,067 యూనిట్లుగా ఉంది. ఇది ఏడాదికేడాది 17.49 శాతం వృద్ధిని చూపుతుంది. ఈ కార్ల తయారీదారుకు ఇది ఇప్పటివరకు అత్యధిక ఎగుమతుల సంఖ్య. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులను పెంచడంలో కీలకమైన మోడళ్లలో మారుతి సుజుకి ఈ-విటారా ఒకటి. కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ వాహనం దాదాపు 70,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. వీటిలో చాలా మోడళ్లు ఎగుమతి అవుతాయి.
Also Read : మారుతి స్విప్ట్.. సేప్టీ రేటింగ్ లో దీని ర్యాంక్ ఎంతంటే? ఇది నమ్మగలరా? అసలు విషయమేంటంటే?