WPL 2024: మీ ఎడిటింగ్ కో దండం.. స్మృతి మందాన చూస్తే పడి పడి నవ్వుతుంది.. వీడియో వైరల్

తెలుగులో సూపర్ హిట్ అయిన జాతి రత్నాలు సినిమాలోని ఓ సన్నివేశాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కప్ గెలుచుకున్న తీరుకు క్రియేటర్స్ ముడిపెట్టారు. ఏకంగా వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 18, 2024 9:07 am

WPL 2024

Follow us on

WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ కప్ ను బెంగళూరు జట్టు గెలుచుకుంది. ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో స్మృతి మందాన సేన సంబరాల్లో మునిగిపోయింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్లో బెంగళూరు ఆశించినంత స్థాయిలో ప్రతిభ చూపించలేకపోయింది. రెండవ సీజన్లోనూ స్మృతి సేన అనేక ఒడిదుడుకులు ఎదుర్కుంటూ ఫైనల్ చేరింది. ముఖ్యంగా ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై జట్టుపై బెంగళూరు అనితర సాధ్యమైన విజయాన్ని సాధించింది. ఫెర్రీ చెలరేగడంతో బెంగళూరు జట్టుకు విజయం సాధ్యమైంది. బెంగళూరు జట్టు ఉమెన్స్ లీగ్ ప్రీమియర్ సెకండ్ సీజన్ కప్ కైవసం చేసుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తుతున్నాయి. వీడియోలు కూడా సందడి చేస్తున్నాయి.

తెలుగులో సూపర్ హిట్ అయిన జాతి రత్నాలు సినిమాలోని ఓ సన్నివేశాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కప్ గెలుచుకున్న తీరుకు క్రియేటర్స్ ముడిపెట్టారు. ఏకంగా వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైదరాబాద్ హవా ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ, మ్యాక్స్ వెల్, మహమ్మద్ సిరాజ్ ముఖాలను జాతి రత్నాలు సినిమాలోని నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖాలకు అన్వయించారు. ఆ చిత్రంలో పిలవని ఫంక్షన్ కు నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వెళ్తారు. కడుపునిండా తింటారు. చివరికి ఆ ఫంక్షన్ లో ఒకరు గిఫ్ట్ ఇస్తుంటే.. వీరు స్టేజి మీదకి వెళ్లి ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తారు. ఫోటో కూడా దిగుతారు. వీరి నిర్వాకం వల్ల అసలు గిఫ్ట్ ఇచ్చే వ్యక్తి సైడ్ అయిపోతాడు.

సేమ్ ఆ సన్నివేశాన్ని నిన్నటి రాయల్ బెంగళూరు చాలెంజర్స్ ఉమెన్స్ టీం ఐపీఎల్ కప్ గెలిచిన తీరుకు క్రియేటర్స్ అన్వయించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం లో కీలక ఆటగాళ్లయిన విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కప్ సాధించినట్టు వీడియో రూపొందించారు. చూసేందుకు ఈ వీడియో నవ్వు తెప్పిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు 16 ఐపిఎల్ సీజన్లు పూర్తయ్యాయి. ఎన్నో అంచనాలు ఉన్న బెంగళూరు జట్టు ఇంతవరకు ఒక్క కప్ కూడా సాధించలేకపోయింది. కానీ అదే మహిళల జట్టు రెండవ సీజన్లోనే కప్ సాధించింది. ఈసారైనా కప్ సాధించాలని బెంగళూరు అభిమానులు కోరుకుంటున్నారు.. ఈ వీడియోని చూసిన నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. “ఒకవేళ ఈ వీడియో గనుక బెంగళూరు కెప్టెన్ స్మృతి మందాన చూసి ఉంటే పడి పడి నవ్వుతుందంటూ” కామెంట్లు చేస్తున్నారు.