Rohith Sharma: టీ20 వరల్డ్ కప్ తరువాత భారత్ న్యూజిలాండ్ సిరీస్ లో ఆడనుంది. అయితే కెప్టెన్ గా రోహిత్ శర్మ కొత్తగా నియమించారు. మొన్నటి వరకు టీ20 ఫార్మాట్ కు విరాట్ కోహ్లి కెప్టెన్ గా ఉండగా.. ఇప్పడు రోహిత్ శర్మను ఎంపిక చేశారు. కాగా విరాట్ కోహ్లి టీ20 వరల్డ్ కప్ కు ముందే తాను టీ 20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. అయితే జట్టులో ఇంత మంది సభ్యులుండగా రోహిత్ శర్మకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది..? అనే చర్చ సాగుతోంది. ఇప్పుడు జరుగుతున్న సిరీస్ కే కాకుండా రోహిత్ శర్మ మరి కొన్ని మ్యాచ్ లకు కెప్టెన్సీగా ఉండే అవకాశం ఉందని సునీల్ గవాస్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

రోహిత్ శర్మ ఇప్పటి వరకు 10 వన్డే వరల్డ్ క్రికెట్ మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. వీటిలో భారత్ 8 మ్యాచ్ లను గెలిచింది. 2018లో రోహిత్ సారథ్యంలో భారత్ జట్టు ఆసియా కప్ గెలిచింది. ఇది కాకుండా రోహిత్ 19 టీ 20 మ్యాచుల్లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. వీటిలో 15 మ్యాచుల్లో గెలిచి, నాలుగు మ్యాచులు ఓడిపోయారు. ఇక ఐపీఎల్ సీరిస్ లోనూ రోహిత్ ప్రతిభను కనబర్చాడు. ఆయన సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. అందువల్ల రోహిత్ కెప్టెన్సీకి ఎంపిక చేశారని అంటున్నారు.
Also Read: Team India: విరాట్ కోహ్లీ, రోహిత్ ను కలిసి ఇక ఆడించరా?
ఇప్పటి వరకు టీ20 మ్యాచుకు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి ఈ ఫార్మాట్ నుంచి వైదొలగినప్పటికీ వన్డే, టెస్టుల్లో కెప్టెన్ గా కొనసాగుతానని చెప్ాడు. అయితే మూడు ఫార్మట్లాకు ఒకే కెప్టెన్ ను ఉంచుతారా..? లేదా ఇలాగే కొనసాగిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. పాకిస్థాన్ లో మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ వ్యవహరిస్తాడు. అదే ఆస్ట్రేలియాలో టీ 20, వన్డే ఫార్మాట్ కు ఆరోన్ ఫించ్ కెప్టెన్ గా ఉండగా.. టెస్టులకు టిమ్ ఫైన్ ఉన్నాడు. అయతే త్వరలో 2022ల టీ 20 ప్రపంచ కప్, 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉంటే మేలని నిపుణులు అంటున్నారు.
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలవి భిన్న మనస్తత్వాలు. రోహిత్ శర్మ యుక్తి, వ్యూహాలతో జట్టు ను నడిపిస్తాడు. విరాట్ కోహ్లి మాత్రం పైకి కెప్టెన్ లా కనిపించకపోయినా వెనక నుంచి ప్లాన్స్ అందిస్తాడు. విరాట్ పనితనం గురించి తెలుసుకున్నారు.. రోహిత్ పనితం ఎలా ఉంటుందో ముందు ముందు చూస్తారని అంటున్నారు. 2017లో ఛాంపియన్ ట్రోపి చేతి వరకు వచ్చి జారిపోయింది. ఫైనల్లో భారత జట్టు వెనుదిరిగింది. 2019 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. అయితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదువకుండా మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉంటే మేలని అంటున్నారు.
Also Read: Team India: టీమిండియా విజయాల బాట పడుతుందా?