Rohith Sharma : రోహిత్ కుదురుకుంటే ఎలా బ్యాటింగ్ చేస్తాడో మరోసారి నిరూపించాడు. చెన్నై బౌలర్లకు వాంఖడే మైదానంలో చుక్కలు చూపించాడు. బౌండరీలు, సిక్సర్ల మోత మోగించాడు. తద్వారా చెన్నై విధించిన లక్ష్యాన్ని గడ్డిపోచతో సమానంగా భావించాడు. అందువల్లే ముంబై జట్టు 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుంది.. అంతేకాదు ఈ పరుగుల ద్వారా చెన్నై జట్టుపై తనకు తిరుగులేదని మరోసారి రోహిత్ శర్మ నిరూపించుకున్నాడు. వ్యక్తిగత స్కోర్ మాత్రమే కాకుండా.. భాగస్వామ్యాల విషయంలోనూ రోహిత్ శర్మ సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. అంతేకాదు అత్యంత అవసరమైన పరిస్థితుల్లో ముంబై జట్టుకు అత్యద్భుతమైన విజయాన్ని అందించి.. తను ఎంతటి కీలక ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు..
Also Read : అరుదైన అద్భుతం: ఒకే రోజు సూపర్ ఇన్నింగ్స్ తో అలరించిన ఇద్దరు దిగ్గజాలు!
కన్నీటి పర్యంతమయ్యాడు
ప్రస్తుతం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్ కు రోహిత్ శర్మ పేరు పెట్టాలని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు చెన్నై జట్టుతో మ్యాచ్ గెలిచిన అనంతరం.. ఇదే విషయాన్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందజేస్తున్న సమయంలో వ్యాఖ్యాత రోహిత్ శర్మ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు.. ” ఒకప్పుడు నేను ముంబైలో గల్లీ క్రికెట్ ఆడాను. కానీ అప్పుడు ముంబై వాంఖడే స్టేడియంలోకి మాకు అనుమతి ఉండదు కాదు. అందులోకి ప్రవేశించడానికి కూడా వీలు ఉండేది కాదు. అక్కడికి వెళ్తే సెక్యూరిటీ గార్డులు వెనక్కి పంపించేవారు. ఆ సమయంలో చాలా బాధనిపించేది. చిన్నప్పుడు వాంఖడే మైదానాన్ని చూడాలని విపరీతమైన కోరిక ఉండేది. అదేంటో గాని ఆ వయసులో అది అందని ద్రాక్ష మాదిరిగానే ఉండేది. ఎవరు ఆ స్టేడియంలోకి రా వద్దని అడ్డుకున్నారో.. ఆ స్టేడియం లోకి వెళ్లడం ఓ కలగానే ఉండేదో.. ఇప్పుడు అవన్నీ నెరవేరాయి. అవన్నీ మదిలో మెదులుతుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. స్టేడియంలో రావద్దని నాడు నన్ను అన్నారు. నేడు నా పేరు మీదనే స్టేడియంలో ఒక స్టాండ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకుమించిన గౌరవం ఒక ఆటగాడికి ఏముంటుంది. ఈ సందర్భంగా ఒక జీవితకాల అనుభూతిలాగా ఉంది.. అద్భుతమైన క్షణం లాగా కనిపిస్తోందని” రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఇటీవల మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ముంబై క్రికెట్ మైదానంలో రోహిత్ శర్మ పేరు మీద స్టాండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. సచిన్ టెండూల్కర్ పేరుమీద ఇప్పటికే ఈ మైదానంలో స్టాండ్ ఉంది. భారత జట్టుకు రోహిత్ శర్మ చేసిన సేవలను గుర్తించి ముంబై స్టేడియంలో అతని పేరు మీద స్టాండ్ ఏర్పాటు చేస్తున్నట్టు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలు పేర్కొన్నారు.
Rohit Sharma said, “In my childhood we were not allowed to enter Wankhede, now a stand is going to be built in my name, this will be a very emotional moment for me, I don’t know how I will react”. #CSKvsMI #RohitSharmapic.twitter.com/1oN8KUoX4e
— Indian Cricket Team (@incricketteam) April 20, 2025