Vaibhav Suryavanshi: ఉపోద్ఘాతం చదివిన తర్వాత ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది.. ఆటగాడు ఎవరనేది.. అవును మీరు అంచనా వేసింది నిజమే.. పై ఉపోద్ఘాతం మొత్తం కూడా రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించే.. పేరులో సూర్య వంశీ ఉన్నట్టే.. అతడి ప్రభ కూడా ఇప్పుడు అలానే వెలిగిపోతుంది. ఒక్క మ్యాచ్ ఆడాడో లేదో.. వైభవ్ సూర్యవంశీ ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు. దేశవ్యాప్తంగా అతని గురించే విపరీతంగా చర్చ జరుగుతోంది.. ఇక మాజీ క్రికెటర్ల విశ్లేషణ కైతే లెక్కేలేదు. ఐపీఎల్ లో ఆడేందుకు వైభవ్ సూర్య వంశీ తీవ్రంగా కష్టపడ్డాడు. మైదానంలో సాధన చేశాడు. చదువుకుంటూనే.. క్రికెట్ ను ఆడాడు.. అద్భుతంగా ఆడి తనను తాను సాన పెట్టుకున్నాడు.. అందువల్లే కేవలం పద్నాలుగు ఏళ్ల వయసులోనే ఐపీఎల్ లోకి ప్రవేశించాడు. యావత్ క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం తన వైపు తిప్పుకున్నాడు. అయితే ఐపీఎల్ లో ప్రవేశించడానికి వైభవ్ చాలా త్యాగాలు చేశాడు.
Also Read: అరుదైన అద్భుతం: ఒకే రోజు సూపర్ ఇన్నింగ్స్ తో అలరించిన ఇద్దరు దిగ్గజాలు!
అన్నింటినీ వదిలేసాడు
వైభవ్ సూర్యవంశీకి మటన్ అంటే చాలా ఇష్టం. పిజ్జా అంటే ఆ విధంగా తింటాడు. అందువల్లే అతడు కాస్త బొద్దుగా ఉంటాడు. అయినప్పటికీ వికెట్ల మధ్య చిరుత పులిలాగా పరుగులు తీస్తుంటాడు. షాట్ల ఎంపికలో అత్యంత ఖచ్చితత్వంతో ఉంటాడు. అయితే వైభవ్ సూర్యవంశీకి మటన్ అంటే చాలా ఇష్టం. పిజ్జా అంటే అమితంగా తింటాడు.. ఐపీఎల్ ఆడుతున్న నేపథ్యంలో రాజస్థాన్ జట్టు డైటీషియన్.. అతడి ఫుడ్ మెనూలో కీలక మార్పులు చేశాడు. ఐపీఎల్ జరుగుతున్నన్ని రోజులు వైభవ్ సూర్యవంశీ మేకపోతు, గొర్రెపోతుల మాంసాన్ని తినకూడదు. పిజ్జా కూడా ముట్టకూడదు. మటన్ మాత్రమే కాదు కోడి మాంసం కూడా అతడు తినకూడదు.. ఇవే కాకుండా ఇతర మాంసాహా పదార్థాలు అతడు ముట్టుకోకూడదు. దీంతో అతడు పూర్తిగా రాజస్థాన్ డైటీషన్ చెప్పినట్టుగానే తింటున్నాడు. ఉదయం మిగడ తొలగించిన పాలు.. బ్రేక్ ఫాస్ట్ లో మొలకలు లేదా శనగలు.. ఉడికించిన ఆకుకూరలు తింటున్నాడు. మధ్యాహ్నం భోజనంలో సలాడ్స్.. ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఆరగిస్తున్నాడు. రాత్రిపూట కూడా శక్తిని ఎక్కువగా ఇచ్చే పదార్థాలు తీసుకుంటున్నాడు. అందువల్లే వైభవ్ సూర్య వంశీ అద్భుతంగా ఆడుతున్నాడు. ఫీల్డింగ్ కూడా గొప్పగా చేస్తున్నాడు.. అయితే మటన్ అతిగా తినడం వల్ల కాస్త అతడు బొద్దుగా కనిపిస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీ కి సత్వర శక్తి లభించాలని అతని తండ్రి మటన్ అలవాటు చేశాడు. అందువల్లే అతడు మటన్ ఎక్కువగా తింటుంటాడు. ఇప్పుడు ఇక రాజస్థాన్ జట్టులో చేరిపోయిన నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ మటన్ పై
తన ఆసక్తిని పూర్తిగా తగ్గించుకున్నాడు.
Also Read: రోహిత్ ఘనత.. ముంబై సరికొత్త చరిత్ర.. చెన్నై పై ఎన్ని రికార్డులో?!