Kadhalikka Neramillai Movie Review: సినిమా ఇండస్ట్రీ లో చాలా మంచి సబ్జెక్ట్ లు వస్తున్నాయి. డిఫరెంట్ కథలతో తెరకెక్కిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ మధ్య కాలం లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ కి మంచి గిరాకీ అయితే ఉంటుంది…ఇక అలాంటి నేపధ్యంలోనే రవి మోహన్, నిత్య మీనన్ కలిసి చేసిన ‘కాదలిక్క నేరమిళ్లై’ మూవీ రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమా ఓటిటి లో కూడా అందుబాటులోకి వస్తుంది. ‘నో టైమ్ టు లవ్’ అంటూ అనువదించబడిన ఈ మూవీ జనవరి 14 వ తేదీన థియేటర్ లో రిలీజైంది. అయితే ఈ సినిమా కమర్షియల్ అంత పెద్దగా వర్కవుట్ కానప్పటికి విమర్శకుల ప్రశంశలు అందుకుంది…
కథ
ముందుకు గా ఈ సినిమా కథ విషయానికి వస్తే భర్త నుంచి విడిపోయిన ఒక మహిళ సమాజం లో ఉన్న కట్టుబాట్లను ధిక్కరిస్తూ IVF ద్వారా ఒక బిడ్డను కనలనుకుంటుంది… దానికోసం ఆమెకి తెలియకుండా బెంగుళూరుకు చెందిన స్ట్రక్చరల్ ఇంజినీర్ సిద్ధార్థ్ గారి స్పెర్మ్ ద్వారా ఆమె గర్భం దాల్చుతుంది…ఇక దాని తర్వాత ఏం జరిగింది ఆమె బిడ్డ కి జన్మనిచ్చిందా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఉదయనిధి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మొదటి నుంచి ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది..భార్య భర్తల మధ్య వచ్చే కోపాలు తాపాలు, కష్టాలు, కన్నీళ్లు ఎలా ఉంటాయి అనేది బాగా చూపిస్తూనే ఇన్ డెప్త్ గా ఇందులో ఒక సోషల్ మేసేజ్ ను కూడా చాలా బాగా కన్వే చేశారు. మొత్తనికైతే కొన్ని ఎమోషనల్ సీన్స్ ను చాలా బాగా తెరకెక్కించారు…ప్రతి ఫ్రేమ్ లో సినిమా తాలూకు మొరల్ అయితే కనిపిస్తుంది…ఇక ప్రీ ఇంటర్వెల్ సీన్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు…
సెకండాఫ్ లో వచ్చే హాస్పిటల్ సీన్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉంటుంది… అందుకే ఒక సినిమా లో ఏ అంశాలు ఉంటాయి ఉంటే ఆ సినిమా ఆడుతుందో ఈ సినిమాలో అలాంటి ఎపిసోడ్స్ పుష్కలం గా ఉన్నాయి…ఈ సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి ఏదో ఒక రకంగా ఈ మూవీ కనెక్ట్ అవుతూ ఉంటుంది…మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే రవి మోహన్ తన పాత్రలో ఒదిగిపోయి నటించడమే కాకుండా ఆయనను మించి ఈ పాత్రని ఎవ్వరూ చేయలేరు అనే రేంజ్ లో చేసి చూపించాడు…ఇక ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆయన చేసిన యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి….ఇక నిత్య మీనన్ చేసిన ప్రతి సీన్ ఒక అద్భుతమనే చెప్పాలి… ఎలాంటి సీన్ ఇచ్చిన కూడా తను నటించి మెప్పిస్తుంది అనేది వాస్తవం…కానీ ఈ సినిమాలో ఆమె పాత్రకి కొన్ని లేయర్స్ ఉంటాయి ఆమె వాటిని కూడా చాలా బాగా మెయింటెన్ చేస్తూ నటించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక ఈమెతో పాటుగా ఈ సినిమా చేసిన మరి కొంతమంది ఆర్టిస్టులు సైతం వాళ్ల పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.
టెక్నికల్ అంశాలు
ఈ సినిమాకి మ్యూజిక్ అనేది చాలా కీలకంమనే చెప్పాలి…దానివల్లే ఈ సినిమా మీద మంచి హైప్ అయితే వచ్చింది. ఇక విజువల్స్ కూడా చాలా వరకు వర్కవుట్ అయ్యాయనే చెప్పాలి…ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగా కుదిరింది. కొన్ని చోట్ల సీన్స్ ను షార్ప్ ఎడిట్ చేశారు.ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా కుదిరాయి…
ప్లస్ పాయింట్స్
కథ
డైరెక్షన్
ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్
రేటింగ్
ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.5/5