Rohit Sharma : RO, హిట్ మాన్ అని కాకుండా రోహిత్ శర్మను ఇకపై ఆ పేరుతోనే పిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే “RO” ఈ ఐపీఎల్లో చెన్నై జట్టుపై అద్వితీయమైన ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో అతడికి సరికొత్త పేరు వచ్చేసింది.. ఆ పేరును ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న మహేళ జయవర్ధనే పెట్టాడు. దీంతో సోషల్ మీడియాలో రోహిత్ శర్మ ను కొత్త పేరుతో అతని అభిమానులు సంబోధిస్తున్నారు. అదే పేరుతో యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఎక్స్, త్రెడ్స్.. అన్నింట్లోనూ ఆ పేరే హవా కొనసాగిస్తోంది. లక్షలలో పోస్టులు ఈ పేరు మీదే వెళ్తున్నాయి.
Also Read : రోహిత్ శర్మ..ఓవర్ నైట్ కెప్టెన్ కాదు.. దాని వెనుక జీవితానికి మించిన కష్టం.. గూస్ బంప్స్ వీడియో ఇది
ఇంతకీ ఆ పేరు ఎవరు పెట్టారంటే..
చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ సూపర్ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ లో ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతనిపై సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. అసలు ఇటువంటి ఆటగాడని ఎందుకు తీసుకుంటున్నారని ముంబై జట్టుపై తీవ్రస్థాయిలో సెటైర్లు వినిపించాయి. అయితే ముంబై జట్టు యాజమాన్యం ఇవేవీ పట్టించుకోలేదు. పైగా అతడికి వరుసగా అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చింది. అయితే రోహిత్ శర్మకు అవకాశాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం జరుగుతుందో చెన్నైతో జరిగిన మ్యాచ్ నిరూపించింది. ఆ మ్యాచ్లో రోహిత్ 76 పరుగులు చేశాడు. అంతేకాదు ఫోర్ ల కంటే సిక్స్ లే ఎక్కువగా కొట్టాడు. అదే కాదు అన్నింటికీ మించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తద్వారా తొమ్మిది వికెట్ల భారీ తేడాతో చెన్నై జట్టు ఈ సీజన్లో అతిపెద్ద విజయాన్ని అందుకుంది. రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో.. ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ లో కీలకమైన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముంబై జట్టు కోచ్ రోహిత్ శర్మ పై ప్రశంసల జలు కురిపించాడు. అంతేకాదు అతడికి “మావెరిక్” అనే పేరు పెట్టాడు. దానికి తోడు కొత్త సన్ గ్లాసెస్ ను బహుమతిగా ఇచ్చాడు. మావెరిక్ అంటే కొత్తగా స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తి అని అర్థం ఉంది. అయితే ఈ సీజన్లో రోహిత్ మొదట్లో ఇబ్బంది పడ్డాడు. తక్కువ పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే ఆ తర్వాత చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక్కసారిగా జూలు విధిల్చాడు. తన పూర్వపు ఫామ్ అందుకొని అదరగొట్టాడు. తద్వారా తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. రోహిత్ ఆడిన ఇన్నింగ్స్ ముంబై జట్టుకు మాత్రమే కాదు.. అభిమానులకు అసలైన ఊపు తెప్పించింది. అంతేకాదు మైదానంలో వారితో తీన్మార్ డాన్స్ వేయించింది.
Also Read : గిల్ ఆడితే బాగుండనుకున్నా.. కానీ.. సిడ్ని టెస్ట్ పై రోహిత్ సంచలన వ్యాఖ్యలు
