Best SUVs : ఒకప్పుడు చిన్న కారు ఉంటే చాలు అని భావించేవారు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు కాస్త ధర ఎక్కువైనా కన్వీనెంట్ గా ఉండే కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో SUV కార్ల వైపు ఎక్కువగా మగ్గుచూపుతున్నారు. ఇటీవల కాలంలో మిగతా కార్ల కంటే ఈ వేరియంట్ కారులు ఎక్కువగా విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. దేశంలోని దిగ్గజ ఆటో కంపెనీలు సెడాన్ కార్లలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నా.. ఈ కంపెనీలు సైతం SUV లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మారుతి సుజుకి తోపాటు మహేంద్ర వంటి కంపెనీలు suv లను మార్కెట్లోకి పోటీపడి తీసుకొస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న టాప్ SUVలు ఏవో తెలుసుకుందాం.
Also Read : ఓ ఊపు ఊపేయడం ఖాయం.. త్వరలో మార్కెట్లోకి 3 ఫుల్ సైజ్ ఎస్‌యూవీలు!
దక్షిణ కొరియా కంపెనీకి చెందిన Hyundai కంపెనీ దేశంలో వివిధ మోడళ్లను ఇప్పటికే ప్రవేశపెట్టింది. ఈ కంపెనీకి చెందిన క్రెటా (Creta) బెస్ట్ SUV గా నిలుస్తుంది. ఈ కారు చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండడంతోపాటు ఇందులో శక్తివంతమైన బాడీ లైన్స్.. కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్.. టైల్ లాంప్స్ ఆకర్షిస్తుంటాయి. ఈ మోడల్ పెట్రోల్ తో పాటు డీజిల్ ఇంకా ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంటు 1.5 లీటర్ ఇంజన్ తో పని పనిచేస్తుంది. ఐదుగురు ప్రయాణికులు సురక్షితంగా వెళ్లే ఈ కారు మార్కెట్లో రూ.11 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ రూ.20.42 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
మారుతి కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా బెస్ట్ ఎస్ యు వి గా గుర్తింపు పొందింది. ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ తో పాటు ఎలక్ట్రి క్ వెర్షన్ కూడా కలిపి హైబ్రిడ్ టెక్నాలజీ తో కలిగి ఉంటుంది. అలాగే సిఎన్జి వేరియంటు కూడా అందుబాటులో ఉంది. 2025 లో ఈ మోడల్ సరికొత్త అప్డేట్ తో మార్కెట్లోకి వచ్చింది. ఈ కారు ప్రారంభ ధర 11.42 లక్షల నుంచి 16.99 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
కియా కంపెనీకి చెందిన సెల్టోస్ కూడా SUV వేరియంట్ లో ది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఈ మోడల్స్ సైతం లేటెస్ట్ ఫీచర్ల తో మార్కెట్లో రిలీజ్ అయింది. దీనిని 11.13 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ రూ. 20.50 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ మోడల్ మైలేజ్ విషయంలో నెంబర్వన్ గా నిలుస్తోంది. ఎస్ యు వి లో మైలేజ్ కావాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.
టాటా కంపెనీకి చెందిన కర్వ్ ఎస్ యు వి కోపే డిజైన్ ను కలిగి ఉంటుంది. దీని ప్రారంభం ధర రూ 10 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ రూ. 19.20 లక్షల వరకు అమ్ముతున్నారు. ఈ మోడల్ 1.2 లీటర్ టర్బో ఇంజన్ను కలిగి ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
Also Read : త్వరలో మార్కెట్లోకి 4 కొత్త SUVలు.. ఫీచర్స్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..