Vijaya sai Reddy : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ విలవిలలాడుతోందా? విజయసాయిరెడ్డి కొట్టిన దెబ్బతో ఆ పార్టీకి మైండ్ బ్లాక్ అవుతోందా? భారీ డ్యామేజ్ తప్పదా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. విజయసాయిరెడ్డి రూపంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెను ప్రమాదం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఏపీలో జరుగుతున్న వరుస అరెస్టులు, కేసుల నమోదు చూస్తుంటే ఇది నిజమేనని స్పష్టమవుతోంది. విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారుతారని తెగ ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా నష్టం తప్పదు. మున్ముందు జైలుకు వెళ్లే పరిస్థితి తప్పించుకోలేరు కూడా. అయితే ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి చేసుకున్న స్వయంకృతాపరాధమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : అప్రోవర్ గా విజయసాయిరెడ్డి? లిక్కర్ కేసులో ఊహించని ట్విస్ట్?
* అప్పట్లోనే సముదాయించి ఉంటే..
సరిగ్గా జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) విదేశీ పర్యటనలో ఉండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని.. మీ మనసులో చోటు లేకుండా పోయిందని జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు విజయసాయిరెడ్డి. అటువంటిప్పుడు పార్టీలో కొనసాగడం దండగ అని అభిప్రాయానికి వచ్చారు. అయితే విజయసాయిరెడ్డికి అప్పట్లో సముదాయింపు లభించలేదు. కనీసం నేను వచ్చాక మాట్లాడతానన్న హామీ కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి రాలేదు. విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన చేయడం.. రాజీనామా లేఖ రాయడం.. అది ఆమోదానికి నోచుకోవడం చక చకా జరిగిపోయాయి. కానీ రాజకీయాల్లోకి రాక మునుపు తనకోసం పనిచేసిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మరిచిపోయారు. తనతోపాటు విజయసాయిరెడ్డి తనకోసం జైలు పాలు అయ్యారన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోలేకపోయారు. పార్టీ ఏర్పాటుతోపాటు అధికారంలోకి తీసుకొచ్చేందుకు విజయసాయిరెడ్డి చేసిన కృషిని కూడా మరిచిపోయారు జగన్మోహన్ రెడ్డి. దాని పర్యవసానమే ఇప్పుడు విజయసాయిరెడ్డి రూపంలో ఎదురవుతున్న ప్రమాదం.
* గౌరవంగా తప్పుకున్న సాయి రెడ్డి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవంగా తప్పుకున్నారు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy). తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని కూడా తేల్చి చెప్పారు. 2029 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరోసారి ఎన్నిక కావాలని కూడా ఆకాంక్షించారు. రాజీనామా చేసిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి పై ఎటువంటి ఆరోపణలు కూడా చేయలేదు. కనీసం ఆ పార్టీ నేతల విషయాన్ని టచ్ చేయలేదు. అయితే విజయసాయిరెడ్డి విషయంలో అదే పనిగా వైసిపి అనుకూల మీడియా దుష్ప్రచారం చేయడంతో విజయసాయిరెడ్డి బయటకు రావాల్సి వచ్చింది. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ అనుకూల మీడియాలో విజయసాయిరెడ్డి పై పతక స్థాయిలో కథనాలు వస్తున్నాయి. సాక్షిలో అయితే తాత అంటూ సంబోధిస్తూ వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మనసు మార్చుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో పడినట్టే.
* పారిశ్రామికవేత్తలు ఎదురు తిరిగితే..
కాంగ్రెస్( Congress) ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పై అవినీతి కేసులు నమోదయ్యాయి. అప్పట్లో పారిశ్రామికవేత్తల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. అయితే అప్పట్లో పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అదే పారిశ్రామికవేత్తలు బిజెపికి సన్నిహితంగా ఉన్నారు. బిజెపి సహకారం లేనిదే వారు ముందడుగు వేయలేని పరిస్థితి. ఒకవేళ విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారి అప్పటి విషయాలను చెప్పడంతో పాటు పారిశ్రామికవేత్తలు ఎదురు తిరిగితే మాత్రం ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి ప్రమాదం తెచ్చుకున్నట్టే. విజయసాయిరెడ్డిని అనవసరంగా కెలికి ప్రమాదం తెచ్చుకోకపోవడమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. జగన్మోహన్ రెడ్డికి ఉత్తమం. ఇక తేల్చుకోవాల్సింది వారే.
Also Read : ఆత్మరక్షణలో వైఎస్సార్ కాంగ్రెస్.. విజయసాయిరెడ్డి పై ఆ నేతలతో విమర్శలు!