Rohit Sharma: ఇంత కష్టపడి చివరికి టీమిండియాలో చోటు సంపాదించుకున్నాడు. కొన్నిసార్లు జట్టు నుంచి దూరంగా వచ్చాడు. కొన్నిసార్లు జట్టుకు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఆటలో తేడా ఉండొచ్చు. కొన్నిసార్లు విఫలం కావచ్చు. కానీ ఇప్పుడు కూడా ఆట మీద మమకారం చంపుకోలేదు. ఇష్టాన్ని వదులుకోలేదు.. అందువల్లే రోహిత్ శర్మ టీమిండియాలో విజయవంతమైన కెప్టెన్ అయ్యాడు. అంతేకాదు టీమ్ ఇండియాకు బ్యాక్ టు బ్యాక్ ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఈ ఘనత సాధించిన తొలి టీమిండియా కెప్టెన్ గా అతడు రికార్డ్ సృష్టించాడు. చిన్నప్పుడే క్రికెట్ మీద ఇష్టంతో తన ఇంటిని వదిలి తాతయ్య ఇంటికి చేరుకున్నాడు. క్రికెట్ మీద మమకారంతో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ అతడు ఆట మీద మమకారాన్ని చంపుకోలేదు. తన చిన్ననాటి రోజుల్లో ఓ స్టేడియం ఓపెనింగ్ కు నాటి టీం ఇండియా ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ వస్తున్నాడని తెలుసుకొని స్కూలుకు రోహిత్ శర్మ డుమ్మా కొట్టాడు. స్టేడియం ప్రారంభ ఫోటోలో రోహిత్ శర్మ ఉన్నాడు. అది మరుసటి రోజు న్యూస్ పేపర్లో ఆ స్కూల్లో ప్రిన్సిపాల్ కు కనిపించింది. దీంతో వెంటనే ప్రిన్సిపాల్ రోహిత్ శర్మని పిలిపించి చివాట్లు పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే క్రికెట్ కోసం రోహిత్ శర్మ ఎన్నో చేశాడు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. జీవితానికి మించి కష్టాలు పడ్డాడు. చివరికి టీమిండియాలో స్థానం సంపాదించుకున్నాడు. టీమిండియాలో స్థానం సంపాదించినప్పటికీ అతడికి సుస్థిరమైన అవకాశాలు రాలేదు. కొన్నిసార్లు జట్టులో చోటు లభించేది. కొన్నిసార్లు ఉద్వాసన ఎదురయ్యేది. చివరికి తన బ్యాటింగ్ ద్వారా స్థానాన్ని రోహిత్ సూచికరం చేసుకున్నాడు . ఆ తర్వాత హిట్ మ్యాన్ గా పేరుపొందాడు.
Also Read: హెడ్ భయ్యా.. ఆడటం ఇష్టం లేకపోతే కావ్య పాపకు చెప్పి తప్పుకోవచ్చుగా!
సొంత మైదానంలో స్టాండ్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో క్రికెట్ ఓనమాలు దిద్దాడు రోహిత్. కానీ ఇప్పుడు అదే స్టేడియంలో తన పేరు మీద ఒక స్టాండ్ ఏర్పాటు చేస్తుండడంతో రోహిత్ ఆనందంతో ఉబ్బి తబ్బిబవుతున్నాడు. రోహిత్ క్రికెట్ ప్రయాణానికి సంబంధించి.. అతడు కెప్టెన్ అయిన విధానం.. టీమిండియాను నడిపించిన విధానం.. టీమిండియా కు ఐసీసీ ట్రోఫీలు అందించిన విధానంపై ప్రముఖ వ్యాఖ్యాత కౌశిక్ ఒక వీడియో రూపొందించాడు. ఆ వీడియోలో రోహిత్ ప్రయాణానికి సంబంధించిన ప్రతి అంశాన్ని అతడు పేర్కొన్నాడు. రోహిత్ గొప్పతనాన్ని వర్ణించడానికి పలు సినిమాల్లోని దృశ్యాలను కౌశిక్ వాడుకున్నాడు. ఆ వీడియో చూస్తుంటే అభిమానులకు గూస్ బంప్స్ కచ్చితంగా వస్తాయి.. త్వరలో రోహిత్ శర్మ పేరు మీద ముంబైలో స్టాండ్ ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో కౌశిక్ రూపొందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
Also Read: గ్రేట్ అభిషేక్.. ఆట తీరుతోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ మనసులు గెలిచావ్.. వైరల్ ఫోటో