Viral Video : కొన్ని సంవత్సరాల కిందట బైకులు, స్కూటర్లు, కార్లు చాలా తక్కువగా ఉండేవి. అలాగే పెట్రోల్ బంకులు కూడా ఇప్పుడు ఉన్నన్ని ఉండేవి కావు. పెట్రోల్ పోయించుకోవాలంటే కొన్ని కిలో మీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. పొరపాటున బండిలో పెట్రోల్ అయిపోతే కొన్ని కిలో మీటర్లు తోసుకొని పోవాల్సి వచ్చేది. అయితే ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందింది. దాంతో పాటే పెట్రోల్ బంకులు కూడా అడుగడునా వెలిశాయి. గతంలో మాదిరి పెట్రోల్ కోసం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.ప్రతి చోటా పెట్రోల్, డీజిల్ లభిస్తూనే ఉంది.
Also Read : బాహుబలి పెళ్లికూతురు.. చూస్తేనే షాక్ అవుతారు.. ఎందుకిలా ముస్తాబైందో తెలుసా?
ఒక వేళ పెట్రోల్ అయిపోతే బైక్ లను తోసుకెళ్లే దృశ్యాలు దాదాపు కనిపించడం లేదు. మారుమూల గ్రామాల్లో కూడా పెట్రోల్ బంకులు ఏర్పడ్డాయి. అలా అభివృద్ధి చెందిన రోజుల్లో కూడా ఓ వ్యక్తి కర్ణాటక నుండి గోవాకు స్కూటర్‌ను తోసుకుంటూ వెళ్లాడు. ఆ వ్యక్తి అలా వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈవీ వాహనాలకు క్రేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. చాలా మంది పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను భరించలేక ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ వాహనాల అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు పర్యవరణాన్ని కాలుష్యం నుంచి రక్షిస్తుంది.
కర్ణాటక, గోవా రెండూ కూడా సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు. సరిహద్దు వెంబడి నడుపుతున్న ఓ వ్యక్తి స్కూటర్ చార్జింగ్ అయిపోయింది. దీంతో ఈ వ్యక్తి తన స్కూటర్ రీఛార్జ్ చేసుకునేందుకు చుట్టుపక్కల వెతికాడు. కానీ ఎక్కడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ జాడ దొరకలేదు. దీంతో చేసేదేం లేక.. స్కూటర్ ను అక్కడే వదిలి వెళ్లలేక ఇలా కర్ణాటక నుంచి గోవాకు తోసుకుంటూ వెళ్లాడు. అలా వెళ్తుండగా ఎవరో అతడిని చిత్రీకరించి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఇది దేశంలో పెరుగుతున్న ఈవీ వాహనాల అమ్మకాలకు అనుగుణంగా వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించడం లేదన్న విషయాన్ని ఈ సంఘటన గుర్తు చేస్తుంది.
ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి సబ్సిడీలను అందజేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు చౌకగా లభిస్తున్నా.. ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడంతో వాటిని కొన్న వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. పెద్ద ఎత్తున ఛార్జింగ్ సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. కానీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఈ సంఘటన గుర్తు చేస్తుంది.
Also Read :మండపంలో సోదరుడి పెళ్లి.. ఇంతలోనే చనిపోయిన వ్యక్తి వచ్చి.. దీవించాడు.. వైరల్ వీడియో
View this post on Instagram