https://oktelugu.com/

Rohit Sharma : బీసీసీఐ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం భారత జట్టు కొంపముంచింది.. 2019 వరల్డ్ కప్ నాటి సంగతిని బయటపెట్టిన రోహిత్

రోహిత్ శర్మ ప్రస్తుతం వ్యాఖ్యానించడంతో.. సెలెక్టర్ల అసలు రంగు ఇప్పుడు బయటపడింది. దీంతో వారి వ్యవహార శైలిపై నెట్టింట విస్తృతమైన చర్చ జరుగుతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 25, 2024 / 10:13 PM IST

    Ms dhoni

    Follow us on

    Rohit Sharma: 2019లో వన్డే వరల్డ్ కప్ సందర్భంగా భారత జట్టులో నాలుగో స్థానంపై విపరీతమైన చర్చ జరిగింది. ఇద్దరి ఆటగాళ్ల మధ్య ఈ స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉండేది.. ఈ సమయంలో సమస్య పరిష్కారం కోసం బిసిసిఐ సెలెక్టర్లు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది కాస్త జట్టు విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది.

    2019 వన్డే వరల్డ్ కప్ భారత క్రికెట్ అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసింది. సెమీస్ లో భారత జట్టు ఓటమిపాలైంది. టీమిండియా కీలక ఆటగాడు ధోని రన్ అవుట్ కావడంతో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో ధోని లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశాడు. వాస్తవానికి నాలుగో స్థానం కోసం విజయ్ శంకర్, అంబటి రాయుడి మధ్య తీవ్రమైన పోటీ ఎదురయింది. రాయుడిని మర్చిపోయి సెలక్టర్లు విజయ్ శంకర్ ను ఎంపిక చేశారు. దీంతో వివాదం నెలకొంది. సెలెక్టర్లపై అంబటి రాయుడు అభిమానులు బహిరంగంగానే విమర్శలు చేశారు. అసలు విజయ్ శంకర్, అంబటి రాయుడి కంటే ఆ స్థానంలో మహేంద్రసింగ్ ధోని బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేదని అప్పట్లో అభిమానులు వ్యాఖ్యానించారు. వారి అభిప్రాయాన్ని ఇప్పుడు రోహిత్ శర్మ మరోసారి వ్యక్తం చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

    “జట్టులో కెప్టెన్ తోపాటు కోచ్ నిర్ణయానికి కూడా కట్టుబడి ఉండాలి. 2019లో నా వ్యక్తిగతంగా అయితే ధోని నాలుగో స్థానంలో వచ్చి ఉంటే బాగుండేది. ధోని అత్యంత కీలకమైన ఆటగాడు. జట్టు అవసరాల కోసం అతడు నాలుగో స్థానంలో కనుక బ్యాటింగ్ కు వచ్చి ఉంటే బాగుండేది. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీని నేను తప్పు పట్టడం లేదు. కోచ్ ను కూడా నిందించడం లేదు. ధోని గనక ముందే బ్యాటింగ్ చేసి ఉంటే నాలో సంతోషం వ్యక్తం అయ్యేదని” రోహిత్ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సెమీస్ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 239 రన్స్ చేసింది. ఓపెనర్లుగా రాహుల్, రోహిత్ మైదానంలోకి వచ్చారు. వీరు పూర్తిగా నిరాశపరిచారు. విరాట్ కోహ్లీ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. ఈ దశలో రిషబ్ పంత్ 32, హార్దిక్ పాండ్యా 32 జట్టు భారాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. ఈ దశలో దినేష్ కార్తీక్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇలా భారత జట్టు 96 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది . ఈ నేపథ్యంలో జట్టుకు ధోని – రవీంద్ర జడేజా ఊపిరి పోశారు. వీరిద్దరూ 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ధోని ఏడో స్థానంలో వచ్చి 50, రవీంద్ర జడేజా 77 పరుగులు చేయడంతో అభిమానులు విజయం పై ఆశలు పెంచుకున్నారు. ఈ క్రమంలో బ్యాటర్లు ఒత్తిడికి గురి కావడంతో భారత్ 221 రన్స్ మాత్రమే చేయగలిగింది. 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మహేంద్రసింగ్ ధోని రన్ అవుట్ కావడం భారత జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది.. అయితే నాటి మ్యాచ్ పై రోహిత్ శర్మ ప్రస్తుతం వ్యాఖ్యానించడంతో.. సెలెక్టర్ల అసలు రంగు ఇప్పుడు బయటపడింది. దీంతో వారి వ్యవహార శైలిపై నెట్టింట విస్తృతమైన చర్చ జరుగుతోంది.