Sunroof cars : కాలం మారుతున్న కొద్దీ కార్లు కొనేవారి అభిప్రాయాలు మారుతున్నాయి. కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పులు రావడంతో వీరు ప్రత్యేకంగా కొన్నిఫీచర్లు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు కొత్త కార్లలో లేటేస్ట్ టెక్నాజీతో కూడిన ఫీచర్లను అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువ మంది కారులో సన్ రూఫ్ ఉండాలిన అనుకుంటున్నారు. ఈ ఫీచర్ ఉన్న కార్లకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కొన్ని లెక్కలను బట్టి చూస్తే సన్ రూప్ ఉన్న కార్లు ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి. అయితే కొన్నికంపెనీలు సన్ రూఫ్ ప్రధాన ఫీచర్ గా మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో టాప్ కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
టాటా కంపెనీకి చెందిన చాలా మోడళ్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో ఎక్కువగా ఎస్ యూవీ వేరయింట్ లే ఉంటాయి. అయితే ఇటీవల కొన్ని మోడళ్లలో ఈ కంపెనీ సన్ రూఫ్ ఫీచర్ ను అందించి వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ కంపెనీకి చెందిన ఎస్ వేరింయట్ లో సన్ రూఫ్ ఫీచర్ ను అందిస్తోంది. దీనిని రూ. 8.35 లక్షలతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ రూ.9.30 లక్షలతో అమ్ముతున్నారు. ఇదే కంపెనీకి చెందిన అల్ట్రోజ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఫీచర్ ను కలిగి ఉంది. ధీనిని రూ.7.45 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. వివిధవేరయింట్లు ఉన్న ఈ మోడల్ రూ. 10 లక్షలతో పొందవచ్చు.
దేశీయ ఆటోమోబైల్ మార్కెట్లో హ్యుందాయ్ తన కార్లతో ఆకట్టుకుంటోంది. ఈ కంపెనీకి చెందిన ఎక్స్ టర్ సన్ రూఫ్ ఫీచర్ ను అందిస్తోంది. దీనిని రూ.8.23 లక్షల ప్రారంభధరతో విక్రయిస్తోంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. టాప్ ఎండ్ రూ. 10 లక్షల వరకు ధర ఉంది. ఇదే కంపెనీకి చెందిన మరో కారు ఐ 20లోనూ సన్ రూఫ్ ఫీచర్ ఉంది. ఇందులో 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీనిని రూ.9.34 లక్షల ప్రారంభధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ మోడల్ రూ.10 లక్షల వరకు ఉంది.
దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా కార్లు దేశీయ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన సోనెట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ను కలిగి ఉంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది. దీనిని రూ. 8.29 లక్షల నుంచి రూ. 9.37 లక్షల వరకు విక్రియస్తున్నారు. ఎస్ యూవీ కార్లకు పెద్దమొత్తంలో మార్కెట్లోకి తీసుకురావడంలో మహీంద్రా కంపెనీ ముందు ఉంటుంది. ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చి XUV 3×0 మోడల్ లో సన్ రూప్ ఫీచర్ ఉంది. ఇది సింగిల్ ఫ్యాన్ ను కలిగి ఉంటుంది. దీనిని రూ. 8.99 లక్షల నుంచి రూ. 9.99 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
ఇవే కాకుండా టాటా నుంచి నెక్సాన్, హ్యుందాయ్ నుంచి ఐ20 ఎన్ లైన్ మోడళ్లలోనూ సన్ రూప్ ఫీచర్స్ తో ఆకట్టుకుంటాయి. సన్ రూఫ్ పీచర్స్ తో కారులో వెంటిలేషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే విశాలమైన స్పేస్ ను కలిగి ఉండి లగ్జరీ కారులో వెళ్తున్న అనుభూతి కలుగుతుంది. అందుకే దీనిని ఎక్కువగా కోరుకుంటున్నారు.