Rohith Sharma : బంగ్లా పై రోహిత్ చెత్త ప్రదర్శన.. తను చేసిన పరుగులు చూసి తలదించుకుంటాడేమో.. మరి ఈసారి ఏం చేస్తాడో?

బంగ్లాదేశ్ జట్టుతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్ మొదలు కాబోతుంది. ఇప్పటికే భారత జట్టు చెన్నై వెళ్ళింది. అక్కడ సాధన మొదలుపెట్టింది. బంగ్లాదేశ్ జట్టు కూడా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 16, 2024 8:45 am

Rohith Sharma

Follow us on

Rohith Sharma :  సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్ట్ మొదలవుతుంది. తొలి టెస్ట్ ముగిసిన తర్వాత 27 నుంచి కాన్పూర్ వేదికగా రెండవ టెస్టు ప్రారంభం అవుతుంది. ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత.. భారత్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. దాదాపు ఆరు నెలల తర్వాత టీమిండియా టెస్ట్ సిరీస్ లో తలపడుతోంది. ఇకనుంచి కొద్ది నెలల వరకు టీమిండియా ఆటగాళ్లకు ఊపిరి సలపని క్రికెట్ షెడ్యూల్ ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఒకవేళ ఈ సిరీస్ భారత్ గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ అవకాశాలు మరింతగా మెరుగుపడతాయి. అందుకనే టీమ్ ఇండియా ఎలాగైనా బంగ్లాదేశ్ జట్టును మట్టి కరిపించాలని భావిస్తోంది. భారత్ ఇలా విజయం సాధించాలంటే అందరి ఆటగాళ్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మెరుగ్గా ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ జట్టుపై రోహిత్ శర్మకు దారుణమైన రికార్డు ఉంది. దానిని చెత్త రికార్డు అని పిలిచినా తప్పులేదు. టెస్టులలో రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగినప్పటి నుంచి భారత జట్టుకు మెరుగైన ప్రదర్శన ఇస్తున్నాడు. వచ్చే సిరీస్ లలో రోహిత్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడతాడని అభిమానులు భావిస్తున్నారు. పైగా రోహిత్ ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే ఇంగ్లాండ్ వరకు టెస్ట్ క్రికెట్లో అద్భుతమైన గణాంకాలను కలిగి ఉన్నాడు. అదే బంగ్లాదేశ్ విషయానికి వచ్చేసరికి పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఇంతవరకు రోహిత్ శర్మ ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా బంగ్లాదేశ్ జట్టు పై ఆడలేకపోయాడు. ఇప్పటివరకు తన ఏరియాలో బంగ్లాదేశ్ జట్టుతో మూడు టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. మూడు ఇన్నింగ్స్ లలో 33 రన్స్ మాత్రమే చేశాడు. ఇందులో అతడి హైయెస్ట్ స్కోర్ 21 పరుగులు కావడం విశేషం. ఈ గణాంకాలు రోహిత్ అభిమానులకే కాదు.. చివరికి రోహిత్ కూడా నచ్చడం లేదు.. అయితే హిట్ మాన్ కొనసాగిస్తాడని అతడి అభిమానులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ జట్టుపై రోహిత్ కు ఉన్న చెత్త రికార్డును ఈ సిరీస్ ద్వారా తొలగించుకోవాలని భావిస్తున్నారు.

ఏకపక్షంగా విజయం సాధించాలని..

మరోవైపు బంగ్లాదేశ్ జట్టుతో జరగబోయే టెస్ట్ సిరీస్ లో ఏకపక్ష విజయం సాధించాలని టీమిండియా భావిస్తోంది. ఇందులో భాగంగానే టీమ్ ఇండియా ఆటగాళ్లు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. బంగ్లాదేశ్ జట్టును ఎదుర్కొనేందుకు చెన్నైలో కొద్దిరోజులుగా సాధన చేస్తున్నారు.. ముఖ్యంగా బంగ్లాదేశ్ జట్టు బౌలర్లను పోలి ఉన్న వారిని ఎంపిక చేసి.. వారి బౌలింగ్లో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. మరోవైపు తొలి టెస్ట్ జరిగే చెన్నై వేదికకు రకరకాల మార్పులు చేస్తున్నారు. రెడ్ సాయిల్ పిచ్ రూపొందిస్తున్నారు. రెడ్ సాయిల్ పిక్ పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో టీమిండియా ఈసారి అనుకున్నంత స్థాయిలో స్పిన్నర్లకు అవకాశాలు ఇవ్వకపోవచ్చు అని ప్రచారం జరుగుతోంది. స్పిన్నర్లకు బదులుగా అదనంగా మరో పేస్ బౌలర్ జట్టులోకి వస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే బుమ్రా, సిరాజ్ భారత పేస్ బౌలింగ్ దళాన్ని మోయనున్నారు. వీరికి జతగా యష్ దయాల్ రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.