https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నాగ మణికంఠ స్నేహం పేరుతో హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ ని మోసం చేస్తున్నాడా..? ఆధారాలు ఇవే!

హౌస్ లో ఇప్పుడిప్పుడే చిన్నగా తనని మార్చుకుంటున్నాడు. వాతావరణంపై తగ్గట్టుగా టాస్కులు కూడా బాగా ఆడుతూ చాలా వరకు పరిణీతి సంపాదించాడు. కానీ ఇతను స్నేహం పేరుతో లేడీ కంటెస్టెంట్స్ ని రెండు సార్లు మోసం చేసినట్టుగా, స్వయంగా ఇతనితో స్నేహం చేసిన కంటెస్టెంట్స్ చెప్పుకొచ్చారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 16, 2024 / 08:47 AM IST

    Bigg Boss Telugu 8(17)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ప్రారంభం నుండి సానుభూతి కార్డుతో ఆడియన్స్ లో ఫాలోయింగ్ ని సంపాదించుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నాగ మణికంఠనే. అతను చెప్పిన వాటిల్లో సగం నిజాలు ఉన్నాయి, సగం అబద్దాలు ఉన్నాయి. ఎక్కువ శాతం అబద్దాలు ఆడి డ్రామాలతోనే ఆయన ఆడియన్స్ లో సానుభూతి సంపాదించాడు. కానీ హౌస్ లో ఇప్పుడిప్పుడే చిన్నగా తనని మార్చుకుంటున్నాడు. వాతావరణంపై తగ్గట్టుగా టాస్కులు కూడా బాగా ఆడుతూ చాలా వరకు పరిణీతి సంపాదించాడు. కానీ ఇతను స్నేహం పేరుతో లేడీ కంటెస్టెంట్స్ ని రెండు సార్లు మోసం చేసినట్టుగా, స్వయంగా ఇతనితో స్నేహం చేసిన కంటెస్టెంట్స్ చెప్పుకొచ్చారు. మొదటి వారం లో విష్ణు ప్రియాతో ఇలాగే చేసాడు. ఆమెలోని నెగటివ్ కోణాలను వెతికేందుకు స్నేహం పేరు వాడుకొని, రెండు మూడు రోజులు ఆమెతో తిరిగి, సరిగ్గా నామినేషన్స్ సమయం లో ఆమెని నామినేట్ చేసి షాక్ కి గురి చేసాడు. విష్ణు ప్రియా పాపం అందుకు చాలా బాధపడింది.

    అప్పుడు యష్మీ మాట్లాడుతూ ‘నువ్వు డ్రామాలు చేస్తావు చూడు నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్ గా ‘ అని అంటాడు. అప్పుడు మణికంఠ ‘లేదు..నేను ఏదైనా క్వాలిటీ ఒక మనిషిలో నచ్చకపోతే నేను దానిని రైజ్ చేస్తాను’ అని అంటాడు. అప్పుడు యష్మీ ‘ఏయ్..ఏంటి నువ్వు బొక్క రైజ్ చేసేది’ అని అంటుంది. ఆ తర్వాత యష్మీ మణికంఠ ని తిరిగి నామినేట్ చేస్తూ ‘నేను హౌస్ లో ఉన్నన్ని రోజులు నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నువ్వు నా గుండెని బద్దలు కొట్టావు’ అని అంటుంది. అసలు నాగ మణికంఠ ఏ కారణంతో యష్మీ ని నామినేట్ చేసాడు, యష్మీ ఎందుకు అంతలా ఫైర్ అయ్యింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవాల్సిందే. యష్మీ అయితే గత వారం నామినేషన్స్ కి చాలా కారణాలే ఇచ్చింది, కానీ ఈ వీళ్లిద్దరి వాదనలో ఎవరిదీ న్యాయం గా ఉంది అనేది తెలియాల్సి ఉంది.