Bigg Boss Telugu 8: హౌస్ మేట్స్ అందరూ కలిసి శేఖర్ బాషా ని బయటకు పంపడానికి కారణం అదేనా..?

ఆదిత్య ఓం హౌస్ లో ఉన్న ఏ ఒక్క కంటెస్టెంట్ తో సరిగా మాట్లాడింది లేదు, ఒక్కటంటే ఒక్క టాస్కు కూడా బాగా ఆడింది లేదు, ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే ఆయనకీ పదం స్పెల్లింగ్ కూడా తెలియదు.

Written By: Vicky, Updated On : September 16, 2024 8:42 am

Bigg Boss Telugu 8(16)

Follow us on

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ రియాలిటీ షో లో కొన్ని ఎలిమినేషన్స్ మనకి చాలా బాధని కలిగిస్తాయి, ఇంత అన్యాయమైన ఎలిమినేషన్ బిగ్ బాస్ హిస్టరీ లోనే జరగలేదు అని బాధపడిపోతూ ఉంటాం, అలాంటి ఎలిమినేషన్ గత వారం జరిగింది. హౌస్ లో అందరినీ నవ్వించే శేఖర్ బాషా ఎలిమినేషన్ ఎంతోమందికి బాధని కలిగించింది. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయ్యుంటే అసలు బాధ ఉండేది కాదేమో, కానీ కంటెస్టెంట్స్ ద్వారా ఎలిమినేషన్ జరగడమే ఆడియన్స్ తీసుకోలేకపోతున్నారు. హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ ఉంటే కిరాక్ సీతకు తప్ప శేఖర్ బాషా ఎవరికీ నచ్చలేదా?, తమ చేతిలో ఎలిమినేషన్ చేసే అవకాశం ఉన్నప్పుడు అతన్ని అందరూ నామినేట్ చేసి బయటకి పంపడం, స్టేజి మీదకు వెళ్తుండగా దొంగ నాటకాలు వేస్తూ ఏడవడం, ఇలాంటి ఫేక్ కంటెస్టెంట్స్ ఆడే ఆటని మనం చూడడం, కర్మరా బాబు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకుంటున్నారు.

ఆదిత్య ఓం హౌస్ లో ఉన్న ఏ ఒక్క కంటెస్టెంట్ తో సరిగా మాట్లాడింది లేదు, ఒక్కటంటే ఒక్క టాస్కు కూడా బాగా ఆడింది లేదు, ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే ఆయనకీ పదం స్పెల్లింగ్ కూడా తెలియదు. అలాంటోడు హౌస్ మేట్స్ కి నచ్చడం ఏందో, టాస్కులు ఆడడంలో కానీ, ఎంటర్టైన్మెంట్ పంచడంలో కానీ, ఎదురు వ్యక్తికీ నోటి నుండి మాట రానివ్వకుండా చేసే వాక్చాతుర్యం, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కి ఏవేవి ఉండాలో అవన్నీ ఉన్నటువంటి శేఖర్ బాషా నచ్చకపోవడం ఏందో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి మాత్రమే అర్థం అవ్వాలి. బయట ప్రేక్షకులందరికీ ఈ ఎలిమినేషన్ అన్యాయం అనిపించింది, అలాంటిది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి అనిపించలేదా. బయట ఉన్నవాళ్లు మనుషులే, లోపల ఉన్న వారు మనుషులే, ఇద్దరి అభిరుచుల మధ్య ఇంత వ్యత్యాసమా? అని ప్రేక్షకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరో అనుమానం కూడా ఉంది, ఇది హౌస్ మేట్స్ తమ ఇష్టంతో చేసిన నామినేషనా?, లేకపోతే బిగ్ బాస్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే సాగిందా అనేది ఆడియన్స్ కి అర్థం కావడం లేదు. ఎందుకంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఆదిత్య ఓం కి ఆడి గెలవాలి అనే తపన ఉంది, ఆయనలో ఫైర్ ఉంది కాబట్టి ఆయనకీ ఒక అవకాశం ఇస్తున్నాము అంటూ అందరూ ఒకే రీజన్ చెప్పి ఆదిత్య ఓం కి ఓట్లు వేశారు. అయితే డేంజర్ జోన్ లోకి వచ్చాను అని తెలిసినప్పుడు ఆదిత్య ఓం లో ఇసుమంత బాధ, భయం లేదు. ఆడాలి అనే కసి ఉన్నోడికి ఎలిమినేట్ అయిపోతున్న సమయంలో కాస్త కూడా బాధ వేయకుండా ఉంటుందా?, మరి ఆదిత్య ఓం లో ఆ బాధ లేదే?, అంటే జరిగే స్క్రిప్ట్ మొత్తం ముందే ఆయనకు తెలుసా వంటి అనుమానాలు ఆడియన్స్ లో ఉన్నాయి. మొత్తానికి ఈ ఒకే ఒక్క ఎపిసోడ్ తో బిగ్ బాస్ గ్రాఫ్ పాతాళంలోకి పడిపోయింది అనే చెప్పాలి.