https://oktelugu.com/

Rohit Sharma : రోహిత్ శర్మ పై పాక్ అక్కసు.. క్రికెట్లో ఇంత దారుణమా?

Rohit Sharma : ఆట తీరు బాగోదు. వ్యవహార శైలి బాగోదు. పర్యాటక జట్లకు కల్పించే భద్రత బాగోదు. మేనేజ్మెంట్ తీరు బాగోదు. ఇలా ఒకటి కాదు ఏ సందర్భంలోనూ.. పాకిస్తాన్ జట్టు.. పాకిస్తాన్ మేనేజ్మెంట్ క్రికెట్ ఆడే విషయంలో.. మ్యాచ్ లు నిర్వహించే తీరు ఏ మాత్రం బాగోదు.

Written By: , Updated On : March 21, 2025 / 03:10 PM IST
Rohit Sharma

Rohit Sharma

Follow us on

Rohit Sharma : ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించినప్పుడు పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ భారత జాతీయ జెండాను ప్రదర్శనకు ఉంచలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే కల్లబొల్లి కబుర్లు చెప్పింది. చివరికి ఐసిసి ఒత్తిడి తీసుకురావడంతో ప్రదర్శించక తప్పలేదు. ఛాంపియన్స్ ట్రోఫీని 2017 లో గెలిచిన పాకిస్తాన్.. స్వదేశంలో ఇటీవల నిర్వహించినప్పటికీ.. ఆ స్థాయిలో ఆడ లేకపోయింది. ట్రోఫీని గెలవడం కాదు కదా.. గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో అడుగుపెట్టి.. అనామక జట్టు లాగా లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో పాకిస్తాన్ జట్టు ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు క్రికెట్ అభిమానులు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్ న్యూజిలాండ్ జట్టుతో ప్రస్తుతం జరుగుతున్న టి20 సిరీస్ కు సీనియర్ ఆటగాళ్లపై వేటు వేసింది. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. ఆయనప్పటికీ పాకిస్తాన్ జట్టు దుస్థితి మారలేదు. ఇప్పటివరకు జరిగిన రెండు టి20 మ్యాచ్లలో పాకిస్తాన్ దారుణమైన ఓటమిని మూట కట్టుకుంది. ట్రై సిరీస్లో పాకిస్తాన్ జట్టును పూజించి ట్రోఫీని అందుకున్న న్యూజిలాండ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో పాకిస్తాన్ జట్టును సొంత దేశంలోనే ఓడించి పరువు తీసింది.

Also Read : ఎయిర్‌పోర్టులో రోహిత్‌ శర్మ అసహనం.. కారణం ఏమిటంటే..!

రోహిత్ మీద పడ్డారు

ఛాంపియన్ ట్రోఫీ లో టీమ్ ఇండియాను విజేతగా నిలిపిన రోహిత్ శర్మ పై ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లు పడ్డారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో క్రికెట్ లీగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టీం చేసిన ఓ పని రోహిత్ అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తున్నది. రోహిత్ శర్మ వాయిస్ ఓవర్ ను ఉపయోగిస్తూ ముల్తాన్ సుల్తాన్స్ అనే జట్టు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో మస్కట్ తో ఓ వీడియోను రూపొందించింది. మస్కట్ లావుగా ఉండడంతో.. రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేశారని టీమిడీ అభిమానులు మండిపడుతున్నారు. ఇది ఒక సిగ్గుమాలిన పని అని.. పాకిస్తాన్ ఆటగాళ్ల నుంచి ఇంతకుమించి ఆశించడం కూడా దండగ అని సోషల్ మీడియాలో రోహిత్ అభిమానులు మండిపడుతున్నారు..” ఆటలో దమ్ము లేదు. క్రీడా స్ఫూర్తి చూపించే సామర్థ్యం లేదు. గౌరవం ఇచ్చుకునే తీరులేదు. క్రమశిక్షణ ఆ జట్టులో ఉండదు. ప్లేయర్లలో అసలు ఉండదు. కనీసం లెజెండరీ ఆటగాడికి ఎలా గౌరవం ఇవ్వాలో కూడా తెలియదు. అలాంటి మూక ఇలాంటి పనులు కాక ఇంకేం చేపడుతుందని” రోహిత్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.. ఇక ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో సెమి ఫైనల్ మ్యాచ్ కు ముందు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రోహిత్ శర్మ పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. అతడు లావుగా ఉన్నాడని.. విరాట్ కోహ్లీ, కపిల్ దేవ్, ధోని లాగా శరీర సామర్థ్యాన్ని కలిగి ఉండడని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపాయి. రోహిత్ అభిమానులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి సైలెంట్ అయిపోయారు. రోహిత్ శర్మ ఆధ్వర్యంలో టీం ఇండియా ఛాంపియన్స్ ట్రఫీ గెలిచిన తర్వాత.. హిట్ మ్యాన్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పుడు కాని రోహిత్ అభిమానులు శాంతించలేదు.

Also Read : 2027 వరకు రోహిత్ శర్మ టెస్టుల్లో కొనసాగుతాడా? బీసీసీఐ మదిలో ఏముందంటే?