Balakrishna (2)
Balakrishna: నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. సినిమా షూటింగులకు షెడ్యూల్ కంటే ముందుగానే హాజరవుతారు. సెట్లోకి అందరికంటే ముందే అడుగు పెడతారు. రాజకీయపరంగాను క్రమశిక్షణతోనే మెలుగుతారు. ప్రజా సమస్యలపై గట్టిగానే వాయిస్ వినిపిస్తారు. ఎంత బిజీలో ఉన్నా.. సొంత నియోజకవర్గ హిందూపురంలో తరచూ పర్యటిస్తుంటారు. నేతలతో పాటు కార్యకర్తల బాగోగులను తెలుసుకుంటూ ఉంటారు. అటు శాసనసభ సమావేశాలతో పాటు పార్టీ పోలిట్ బ్యూరో సమావేశాలకు తప్పకుండా హాజరు అవుతారు. అటువంటి బాలకృష్ణ గత 15 రోజులుగా జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కనిపించలేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలకు హాజరు కాలేదు. సాయంత్రం జరిగిన సాంస్కృతిక వేడుకల్లో కూడా కనిపించలేదు. దీంతో నందమూరి బాలకృష్ణ ఎక్కడ? అన్న టాక్ వినిపించింది.
Also Read: ఆ నలుగురికి క్యాబినెట్ హోదా.. చంద్రబాబు సంచలన నిర్ణయం
* అఖండ 2 షూటింగ్లో బిజీ
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అఖండ 2( akhanda 2 ) సినిమా చిత్రీకరణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నటించిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించింది. బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో అఖండ 2 సినిమాపై అనేక అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్లో బాలకృష్ణ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే శాసనసభ సమావేశాలకు గైర్హాజరైనట్లు సమాచారం. అయితే అందరూ కనిపించి నందమూరి బాలకృష్ణ కనిపించకపోయేసరికి హిందూపురం నియోజకవర్గం ప్రజలు నిరాశకు గురయ్యారు. నందమూరి అభిమానుల సైతం బాలకృష్ణ ను తలుచుకున్నారు.
* చలాకీ ఆయన సొంతం..
వాస్తవానికి నందమూరి బాలకృష్ణ చాలా చలాకీగా ఉంటారు. విపరీతమైన స్టార్ డం ఉన్నా.. అసెంబ్లీలో( assembly) చాలా బాధ్యతగా ఉంటారు. తోటి శాసనసభ్యులతో సరదాగా గడుపుతారు. అయితే ప్రజా ప్రతినిధుల క్రీడా పోటీలు బాలకృష్ణ కనిపిస్తే ఆ సందడే వేరు. మైదానంలో బాలకృష్ణ కనిపిస్తే అభిమానుల్లో ఒక రకమైన పూనకం రావడం ఖాయం. స్వతహాగా నటుడు అయిన బాలకృష్ణ.. సాంస్కృతిక వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు అనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. కానీ ఆ చాన్స్ మిస్ చేసుకున్నారు బాలకృష్ణ. అయితే ప్రస్తుతం బాలకృష్ణ హిమాలయాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ సినిమా సెట్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారని.. నిరవధిక షెడ్యూల్ కొనసాగుతుందని తెలుస్తోంది. అందుకే తన పొలిటికల్ కెరీర్ లోనే తొలిసారిగా అసెంబ్లీకి డుమ్మా కొట్టారని తెలుస్తోంది.
Also Read: నాగబాబు మంత్రి పదవి.. అంత కాలం లేటు అంట