Jagan
Jagan : ఏపీలో ( Andhra Pradesh)రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి 10 నెలల పాలన పూర్తి చేసుకుంది. పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకునే పనిలో పడింది. పార్టీలో సమూల ప్రక్షాళన తీసుకొచ్చి.. గాడిలో పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. పార్టీకి గుడ్ బై చెప్పిన వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. ఉగాది తర్వాత జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. మరోవైపు తాడేపల్లి కార్యాలయం వద్ద భారీ ప్రజా దర్బార్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తనను కలిసేందుకు వచ్చే వారికి అక్కడ భోజన ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. అయితే శాసనసభకు హాజరుకాకుండానే ఓ ఏడుగురు రిజిస్టర్లో సంతకాలు పెట్టారంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బలమైన చర్చ నడుస్తోంది. అయితే అదే స్పీకర్ అయిన పాత్రుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి జీతం తీసుకోవడం లేదని తేల్చి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది.
Also Read : కోటరీకి చెక్.. వైఎస్ఆర్ బాటలో జగన్.. కీలకనిర్ణయం
* ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో..
ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నుంచి కేవలం 11 మంది మాత్రమే గెలిచారు. ఆ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగింది ఆ పార్టీ. కానీ చాలా జిల్లాల్లో తుడుచుపెట్టుకుపోయింది. ఐదారు జిల్లాల్లో కనీసం ప్రాతినిధ్యం లేదు. నిబంధనల మేరకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని కూటమి ప్రభుత్వం తేల్చేసింది. అటు స్పీకర్ సైతం ఈ విషయంలో స్పష్టతనిచ్చారు. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. కానీ ఎమ్మెల్యేల ప్రమాణం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అటు తర్వాత సభకు దూరంగా ఉంటున్నారు.
* స్పీకర్ కీలక ప్రకటన
అయితే తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ( speaker ayyanna patrudu)అసెంబ్లీలో కీలక విషయాలను ప్రకటించారు. సభలో కొంతమంది సభ్యులు అసెంబ్లీకి వచ్చి హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని తెలిపారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, వేగం మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వర రాజు, అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధలు ఉన్నారని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అయితే దీనిపై జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కీలక సూచన చేశారు. ప్రజల సొమ్ము జీతం గా తీసుకుంటూ సభకు రాకుండా సంతకాలు పెట్టడంపై ఎథిక్స్ కమిటీకి నివేదించాలని సూచించారు. దీంతో జీతాల అంశం తెరపైకి వచ్చింది.
* అధినేత ఆదేశాలతో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి జీతాల అంశాలను ప్రకటించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. వైయస్ జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. అయితే జగన్మోహన్ రెడ్డి తరహాలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యాక ప్రకటన వస్తుందని తెలుస్తోంది.
Also Read : కూటమికి ‘రుషికొండ’ అస్త్రం.. చేజేతులా అందించిన జగన్మోహన్ రెడ్డి!
Post Jagan salary as CM – Rs.1/-
Actually CM salary (3,35,000+ allowances)Jagan salary as an MLA now – Rs 0/-@ysjagan pic.twitter.com/C5KWkBuBiZ
— RAJIV (@KingRajiv) March 21, 2025