India ODI Squad: టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ప్రకటించారు. జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికాలో నిర్వహించే మూడు వన్డేల సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. దీనికి పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు బాధ్యతలు అప్పగించారు. దీంతో రోహిత్ శర్మను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే రోహిత్ కు గాయం కావడం వల్ల అతడి ఫిట్ నెస్ సరిగా లేకపోవడంతో రోహిత్ ను జట్టులోకి తీసుకోలేదు.
కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లిని తప్పించి రోహిత్ శర్మకు అధికారం అప్పగించినా అతడి ఫిట్ నెస్ కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోవడం గమనార్హం. ఫిట్ నెస్ విషయంలో ప్రయోగాలు చేయలేమని బీసీసీఐ చెబుతోంది. రోహిత్ పూర్తిగా కోలుకున్నాకే జట్టులోకి తీసుకుంటామని తేల్చారు. ఈ స్థితిలో ప్రయోగాలు చేయలేం. అతడితో ఆటలు ఆడించలేమని ప్రకటిస్తోంది.
వచ్చే ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించడం లేదు. అతడిని ప్రపంచ కప్ వరకు పూర్తి స్థాయిలో కోలుకునేలా విశ్రాంతిని ఇస్తున్నారు. దీంతో కెప్టెన్ గా కేఎల్ రాహుల్ కు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో రోహిత్ శర్మకు తగిన విశ్రాంతి ఇచ్చేందుకు నిర్ణయించింది.
Also Read: India vs SA: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సఫారీల గడ్డపై టీమిండియా చారిత్రక విజయం
పేసర్ బుమ్రా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. గాయం కారణంగా టెస్ట్ సిరీస్ ఆడలేకపోతున్న రోహిత్ ప్రస్తుతం బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. దీంతో అధికారం అందినట్టే అంది దూరం కావడంతో రోహిత్ శర్మ దిగులు చెందుతున్నట్లు తెలుస్తోంది. త్వరగా కోలుకుని టీమిండియాకు సారధ్యం వహించాలన్నదే అతడి అభిమతంగా తెలుస్తోంది.
Also Read: SA Test Series: దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ లో విజయం సాధించేనా? చిరకాల వాంఛ తీరేనా?