Induvadana Telugu Movie Review
నటీనటులు : వరుణ్ సందేశ్, ‘ఫర్నాజ్ శెట్టి’, ధన్‌రాజ్, రఘుబాబు, అలీ తదితరులు.
దర్శకత్వం : ఎంఎస్‌ఆర్
స్క్రీన్ ప్లే : ఎంఎస్‌ఆర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత : మాధవి ఆదుర్తి
సంగీతం : శివ కాకాని
కథ : సతీష్
వినూత్న దర్శకుడు ‘ఎంఎస్‌ఆర్’ దర్శకత్వంలో ‘వరుణ్ సందేశ్ – ఫర్నాజ్ శెట్టి’ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా `ఇందువదన`. ఈ రోజు రిలీజ్ అయింది ఈ సినిమా. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.
కథ :
గిరిజన జాతికి చెందిన ఇందు ( ఫర్నాజ్ శెట్టి)ని చూసి ఫారెస్ట్ ఆఫీసర్ అయిన వాసు (వరుణ్ సందేశ్) ప్రేమలో పడతాడు. వీరి మధ్య చోటు చేసుకున్న కొన్ని సంఘటనల అనంతరం ఇందు కూడా వాసుని ప్రేమిస్తోంది. అయితే, ఇద్దరు ఒకరిని ఒకరు ఘాడంగా ప్రేమించుకున్నా.. వారి ప్రేమను, అలాగే వారి పెళ్లిని పెద్దలు ఒప్పుకోరు. ఈ నేపథ్యంలో ఇందు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఇందుని వాసు గ్రామం వారు చంపేస్తారు. దాంతో వాసు జీవితం కూడా మలుపు తిరుగుతుంది. అసలు ఇందును ఎవరు చంపారు ? వాసు జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ప్రేమకు సంబంధించిన మంచి స్టోరీ లైన్ తీసుకున్న దర్శకుడు ఎంఎస్‌ఆర్, తన అద్భుతమైన టేకింగ్ తో, వెరీ ఎమోషనల్ విజన్ తో ‘ఇందువదన’ను ఎమోషనల్ లవ్ డ్రామాగా చాలా బాగా మలిచాడు. హీరోయిన్ గెటప్ దగ్గర నుంచి ఆమె హావభావాల వరకు, అలాగే హీరో లుక్ అండ్ క్యారెక్టర్ లోని షేడ్స్ వరకు దర్శకుడు ఎంఎస్‌ఆర్ తీసుకున్న జాగ్రత్తలు సినిమా స్థాయిని నాలుగింతలు పెంచింది.
ఏ సినిమాలోనైనా కథను ఎలివేట్ చేసే సీన్స్ ఉంటాయి. కథను ఎలివేట్ చేయడానికి మాత్రమే ఆ సీన్స్ ఉపయోగపడతాయి. సహజంగా అలాంటి సీన్స్ లో ఇంట్రెస్ట్ ఉండదు. కానీ, ఆ సీన్స్ ను చాలా ఎంటర్ టైన్ గా చెప్పాలంటే ఆ దర్శకుడికి గొప్ప విజువల్ సెన్స్ ఉండాలి. ఆ విసయంలో ఎంఎస్‌ఆర్ ఎంతో అనుభవజ్ఞుడైన దర్శకుడిలా సాధారణ సన్నివేశాలను కూడా చాలా చక్కగా తెరక్కించాడు. అతని విజువల్ సెన్స్ చాలా బాగుంది.
నిజానికి సతీష్ ఇచ్చిన కథలో కొన్ని లోపాలు ఉన్నా.. ఆ లోపాలను తన దర్శకత్వ పనితీరుతో దర్శకుడు ఎంఎస్‌ఆర్ చాలా బాగా కవర్ చేశాడు. ఎంఎస్‌ఆర్ డైరెక్షనే సినిమాకి పెద్ద ప్లస్ అయింది. ఇక వరుణ్ సందేశ్ జీవితంలో ఓ క్లిష్టమైన సమస్య రావడం, ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలను, దాంతో పాటు హీరోయిన్ ట్రాక్ ను కూడా బాగా డిజైన్ చేశారు. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువులు కూడా బాగున్నాయి.
హైలెట్ పాయింట్స్ :
దర్శకుడు ఎంఎస్‌ఆర్ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్,
వరుణ్ సందేశ్ నటన,
‘ఫర్నాజ్ శెట్టి’ గ్లామర్
ఎమోషనల్ సీన్స్
సాంకేతిక వర్గం పనితీరు
Also Read: Akhil Akkineni: కండలతో పాటు బడ్జెట్ పెంచితే కష్టం కదా !
సినిమా చూడాలా ? వద్దా ?
`ఇందువదన` అంటూ వచ్చిన ఈ సీరియస్ ఎమోషనల్ డ్రామాలో స్వచ్ఛమైన ప్రేమ కథ ఉంది. ఈ సినిమాను కచ్చితంగా చూడొచ్చు.
రేటింగ్ : 3 /5
Also Read: Abhinav Gomatam: హీరో అవతారం ఎత్తుతున్న మరో కమెడియన్ !