https://oktelugu.com/

Abhinav Gomatam: హీరో అవతారం ఎత్తుతున్న మరో కమెడియన్ !

Abhinav Gomatam: సినిమా హీరో అయిపోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అదేంటో చివరికి కమెడియన్ కి కూడా హీరో అయిపోవాలని ఆశ కలగడం నిజంగా విచిత్రమే. అసలు ఈ కమెడియన్లకు ఈ మధ్య మరీ ‘హీరో పిచ్చి’ పట్టుకుంది. అవకాశం దొరికితే హీరోయిన్ తో డ్యూయెట్ కి రెడీ అయిపోతున్నారు. గతంలో హాస్య నటుడిగా అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వాళ్ళు హీరో పాత్రలు చేసేవాళ్ళు. కానీ, ఇప్పుడు చిన్న సక్సెస్ వచ్చినా చాలు వెంటనే.. హీరో […]

Written By:
  • Shiva
  • , Updated On : January 1, 2022 / 04:56 PM IST
    Follow us on

    Abhinav Gomatam: సినిమా హీరో అయిపోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అదేంటో చివరికి కమెడియన్ కి కూడా హీరో అయిపోవాలని ఆశ కలగడం నిజంగా విచిత్రమే. అసలు ఈ కమెడియన్లకు ఈ మధ్య మరీ ‘హీరో పిచ్చి’ పట్టుకుంది. అవకాశం దొరికితే హీరోయిన్ తో డ్యూయెట్ కి రెడీ అయిపోతున్నారు. గతంలో హాస్య నటుడిగా అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వాళ్ళు హీరో పాత్రలు చేసేవాళ్ళు.

    Abhinav Gomatam

    కానీ, ఇప్పుడు చిన్న సక్సెస్ వచ్చినా చాలు వెంటనే.. హీరో అవతారాలు ఎత్తేస్తున్నారు. ఈ కోవలో స్టార్ కమెడియన్ల నుంచి చిన్నాచితకా కమెడియన్ల వరకూ చాలామంది ఉన్నారు. బ్రహ్మానందం, ఆలీ, సునీల్, వెన్నెల కిశోర్ ఇలా వీరంతా హీరోలుగా ప్రయత్నం చేసినవారే. ఇప్పటికీ సప్తగిరి, షకలక శంకర్ ఇంకా హీరోలుగా సినిమాలు చేస్తున్నవారే.

    ఇంకా కొందరు కమెడియన్స్ హీరోగా మారి కొన్ని సినిమాలు చేశారు. అవి డిజాస్టర్లు అయ్యాయి అనుకోండి. అసలు ఏ కమెడియన్ ఇంతవరకు హీరోగా లాంగ్ ఇన్నింగ్స్ కంటిన్యూ చెయ్యలేదు అనే నగ్న సత్యం తెలిసి కూడా ఇంకా హీరో పాత్రల కోసం కొందరు కుర్ర కమెడియన్లు ఆశ పడుతూ ఉండటం ఆశ్చర్యకరమే. తాజాగా ఓ హాస్య నటుడు, కథానాయకుడు బాటలో నడిచేందుకు రెడీ అయ్యాడు.

    Also Read: కండలతో పాటు బడ్జెట్ పెంచితే కష్టం కదా !

    ఆ యువ కమెడియన్ పేరు అభినవ్ గోమఠం. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. గుర్తింపు అంటే అదేదో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఏమి కాదు. ఏదో చిన్న పేరు సంపాదించాడు. ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాతో అతనికి మంచి పేరు వచ్చింది. అందుకే అభినవ్ గోమఠం ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నాడు.

    పైగా ఈ సినిమాని క్రియేటివ్ వర్క్స్ నిర్మిస్తుంది. ఈ రోజు అభినవ్ గోమఠం పుట్టిన రోజు. కాబట్టి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేశారు నిర్మాతలు.

    Also Read: ఆ సింగర్ కోసం మహేష్ పైరవీలు చేశాడట !

    Tags