Rohit Sharma : రోహిత్ శర్మకు కుటుంబ సభ్యుల ఘన స్వాగతం.. ఏర్పాట్లు చూసి ఉబ్బితబిబ్బైన టీమిండియా కెప్టెన్

Rohit Sharma స్వదేశం వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లోనూ ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలయింది.

Written By: NARESH, Updated On : July 5, 2024 2:46 pm
Follow us on

Rohit Sharma : టీమిండియా 17 సంవత్సరాల తర్వాత టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. 2007లో ధోని ఆధ్వర్యంలో టి20 వరల్డ్ కప్ తొలి ఎడిషన్ లో విజేతగా నిలిచిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత ఆ స్థాయిలో ప్రదర్శన చూపించలేకపోయింది. 2014లో ఫైనల్ వెళ్ళినప్పటికీ.. శ్రీలంక చేతిలో ఓడిపోయింది.. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా – వెస్టిండీస్ వేదికల పై జరిగిన టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చూపించింది. ఐర్లాండ్ జట్టు నుంచి మొదలు పెడితే దక్షిణాఫ్రికా వరకు వరుస విజయాలు సాధించి.. టి20 వరల్డ్ కప్ విజేతగా ఆవిర్భవించింది.

టి20 వరల్డ్ కప్ సాధించిన నేపథ్యంలో టీమిండియా పై ప్రశంసల జల్లు కురుస్తోంది. గురువారం ఉదయం ప్రత్యేక విమానం ద్వారా బార్బడోస్ నుంచి న్యూఢిల్లీ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు దేశం యావత్తు ఘన స్వాగతం పలికింది. ముందుగా టీమిండియా ఆటగాళ్లు దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ముంబై వెళ్ళిపోయారు. ముంబైలోని వాంఖడె మైదానంలో విక్టరీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాదిగా అభిమానులు హాజరై టీమిండియా ఆటగాళ్లకు జేజేలు పలికారు. ముఖ్యంగా రోహిత్ నామస్మరణతో ముంబయి మార్మోగిపోయింది. ఈ క్రమంలో బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లను ఘనంగా సత్కరించింది. 125 కోట్ల రూపాయల విలువైన చెక్కును అందించింది.

గురువారం రాత్రి దాకా ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోని తన స్వగృహానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూల పాన్పు పరచి తమ ప్రేమను చాటుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. రోహిత్ అలా నిల్చుని ఉండగా.. పూలను పాన్పులాగా పరిచిన దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.. కుటుంబ సభ్యులు తనకోసం చేసిన ఏర్పాట్లను చూసి రోహిత్ శర్మ ఉబ్బితబ్బిబ్బయ్యాడు

స్వదేశం వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లోనూ ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలయింది. ఇన్ని ఓటములతో డీలా పడిన టీమిండియా కు టి20 వరల్డ్ కప్ విజయం సరికొత్త శక్తిని ఇచ్చింది. ముఖ్యంగా రోహిత్ శర్మకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది.. ఈ గెలుపుతో రోహిత్ టి20 కెరియర్ కు గుడ్ బై చెప్పేశాడు. ఇక ప్రస్తుతం అతని మదిలో త్వరలో జరగబోయే ఛాంపియన్స్ క్రికెట్ టోర్నీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఉన్నాయి. ఈ రెండు ఐసీసీ మెగా టోర్నీలలో భారత జట్టును విజేతగా నిలపాలని రోహిత్ భావిస్తున్నాడు. ఈ రెండు టోర్నీలలో కూడా భారత్ విజేతగా నిలిస్తే.. రోహిత్ అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా చరిత్రకెక్కుతాడు.