Homeఆంధ్రప్రదేశ్‌Anil Kumar Yadav: అనిల్ యాదవ్ తోనే నెల్లూరులో వైసీపీకి లాస్.. రెడ్డి సామాజిక వర్గం...

Anil Kumar Yadav: అనిల్ యాదవ్ తోనే నెల్లూరులో వైసీపీకి లాస్.. రెడ్డి సామాజిక వర్గం గుస్సా

Anil Kumar Yadav: వైసీపీలో కులాల కుంపట్లు బయటపడ్డాయా? ఓటమికి కారణం మీరంటే మీరు అని నేతలు కయ్యానికి దిగుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వైసిపి పతనానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కారణమని రెడ్డి సామాజిక వర్గం ఆరోపణలు చేయడం విశేషం. అనిల్ తీరుతోనే ఎన్నికలకు ముందు రెడ్డి సామాజిక వర్గం నేతలంతా టిడిపిలో చేరిపోయారని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఓటమితో స్వయంగా వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గం అనిల్ తీరుపై రుస రుసలాడుతోంది. ఆయనకు ఇప్పటికీ జగన్ ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పుపడుతోంది రెడ్డి సామాజిక వర్గం. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించిన క్రమంలో.. వైసీపీ శ్రేణుల మధ్య చిన్నపాటి వాదన రేగినట్లు సమాచారం.

వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి. 2014లో ఏకపక్ష విజయం అందించింది ఆ జిల్లా. 2019లో అయితే క్లీన్ స్వీప్ చేసింది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. టిడిపి కూటమి వైట్ వాష్ చేసింది. అయితే ఇంతటి భారీ ఓటమికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2019లో అధికారం చేపట్టిన జగన్ తన మంత్రివర్గంలోకి అనిల్ కుమార్ యాదవ్ ను తీసుకున్నారు. దీంతో ఆయన స్థానిక రెడ్డి సామాజిక వర్గాన్ని పట్టించుకోలేదు. జగన్ ను గౌరవిస్తూ నెల్లూరు జిల్లాలో పెద్ద రెడ్లను దారుణంగా అవమానించారు. దీంతో ఎన్నికలకు ముందే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నెల్లూరు పార్లమెంట్ స్థానం అభ్యర్థి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ప్రశాంతి రెడ్డిని అనిల్ టార్గెట్ చేసుకున్నారు. కానీ జగన్ నుంచి వారికి స్వాంతన లభించలేదు. తిరిగి అనిల్ కు మద్దతు తెలిపారు జగన్. అందుకే ఆ దంపతులు పార్టీకి దూరమయ్యారు. వైసీపీ క్యాడర్ను తీసుకెళ్లి టిడిపిలో చేరిపోయారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఈ గడ్డు పరిస్థితికి కారణమయ్యారు.

వైసీపీకి మూలస్తంభంలా నిలబడ్డారు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అటువంటి వేంరెడ్డిపై చాలా సందర్భాల్లో అనిల్ కుమార్ యాదవ్ విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డిని రాజమాతగా తులనాడుతూ అనిల్ చేసిన వ్యాఖ్యలు విపరీతంగా ప్రభావం చూపాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అనిల్ తీరును వ్యతిరేకించడం ప్రారంభించింది. అయితే జగన్ అనిల్ కు వెన్నుతట్టి ప్రోత్సహించడంతో ఆ ప్రభావం వైసీపీ పై పడింది. వైసీపీని సైతం రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకించడం ప్రారంభించింది. అదే నెల్లూరు జిల్లాలో టిడిపి కూటమి గెలుపునకు కారణమైంది. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శకు జగన్ వచ్చిన తరుణంలో.. పార్టీ శ్రేణుల మధ్య ఇదే హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper
Exit mobile version