Raj Tarun: యంగ్ హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు అయ్యింది. ఓ యువతి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. వివరాల్లోకి వెళితే.. లావణ్య అనే యువతి ఈ కేసు పెట్టారు. రాజ్ తరుణ్-లావణ్య 11 ఏళ్ళుగా రిలేషన్ లో ఉన్నాడట. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందట. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాడట. మూడు నెలల క్రితం లావణ్య ఇంటి నుండి రాజ్ తరుణ్ బయటకు వెళ్ళిపోయాడట. తాను కొత్తగా నటిస్తున్న మూవీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడట. ఈ క్రమంలో తనను అవైడ్ చేస్తున్నాడట.
తనను వదిలేయకపోతే చంపి, శవం కూడా దొరకకుండా మాయం చేస్తానని బెదిరించాడట. కావాలనే తనను డ్రగ్స్ కేసులో ఇరికించాడట. ఆ కేసులో 45 రోజులు లావణ్య జైలు జీవితం అనుభవించిందట. అప్పుడు కూడా తనకు రాజ్ తరుణ్ ఎలాంటి సహాయం చేయలేదట. రాజ్ తరుణ్ తనకు కావాలంటున్న లావణ్య, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది.
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో కూడా రాజ్ తరుణ్ కొన్ని వివాదాల్లో చిక్కుకున్నాడు. మద్యం మత్తులో కారు వేగంగా నడిపి యాక్సిడెంట్ చేశాడు. పోలీసులు వచ్చే లోపు అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేశాడు. రాజ్ తరుణ్ యాక్సిడెంట్ చేసిన పారిపోతున్న వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. తాజాగా చీటింగ్ కేసు ఆయన మీద నమోదు అయ్యింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. అతడు సపోర్టింగ్ రోల్స్ కి పడిపోయాడు.
సంక్రాంతికి విడుదలైన నా సామిరంగ చిత్రంలో నాగార్జున హీరోగా నటించారు. అల్లరి నరేష్ సెకండ్ హీరో కాగా, రాజ్ తరుణ్ సపోర్టింగ్ రోల్ చేశారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన తిరగబడరసామీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. ఏఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కెరీర్ బిగినింగ్ లో రాజ్ తరుణ్ సూపర్ హిట్స్ ఇచ్చారు. ఆయన డెబ్యూ మూవీ ఉయ్యాలా జంపాలా మంచి విజయం సాధించింది. కుమారి 21ఎఫ్ తో భారీ విజయం ఖాతాలో వేసుకున్నాడు. వరుస పరాజయాలతో రేసులో వెనుకబడ్డాడు.