Rachin Ravindra: ఆ న్యూజిలాండ్ అల్ రౌండర్ ని ముంబై టీమ్ లోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్న రోహిత్ శర్మ…

ఐపిఎల్ ప్రాంచైజర్స్ కూడా విపరీతం గా డబ్బులు పెట్టీ క్వాలిటీ ఉన్న ప్లేయర్లని కొనుగోలు చేస్తున్నారు... దానికి తగట్టు గానే తనదైన రీతిలో ప్లేయర్లు కూడా అద్భుతాలు చేస్తూ చాలా బాగా ఆడుతున్నారు.

Written By: Gopi, Updated On : October 31, 2023 4:52 pm

India Vs New Zealand Semi Final

Follow us on

Rachin Ravindra: ఇండియా లోనే కాదు ప్రపంచం మొత్తం మీద అత్యంత క్రేజ్ ఉన్న లీగ్ ఏదైనా ఉంది అంటే అది ఐపిఎల్ అనే చెప్పాలి. ప్రపంచంలో ఉన్న అన్ని లీగ్ ల్లో ప్రస్తుతం ఐపీఎల్ అత్యంత ఖరీదైన లీగ్ గా కూడా గుర్తింపు పొందింది.ఇక ఇలాంటి సమయంలో ప్రతి ప్లేయర్ కూడా ఐపీఎల్ లో ఆడాలనే ఉద్దేశంతోనే ఉంటారు. ఎందుకంటే ఐపీఎల్ లో ఆడితే అందరికీ మంచి గుర్తింపు వస్తుంది అలాగే వాళ్ల దేశాలకు ఆడితే సంవత్సరం మొత్తంలో ఎంత ఆదాయం అయితే వస్తుందో అంతకంటే ఎక్కువ ఒక ఐపిఎల్ సీజన్ లోనే వస్తుంది ఇక మనీ కి మనీ, నేమ్ కి నేమ్ వస్తుంది కాబట్టి ఎక్కువ మంది విదేశీ ప్లేయర్లు కూడా ఐపీఎల్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.

ఇక అందుకు ఏ మాత్రం తగ్గకుండ ఐపిఎల్ ప్రాంచైజర్స్ కూడా విపరీతం గా డబ్బులు పెట్టీ క్వాలిటీ ఉన్న ప్లేయర్లని కొనుగోలు చేస్తున్నారు… దానికి తగట్టు గానే తనదైన రీతిలో ప్లేయర్లు కూడా అద్భుతాలు చేస్తూ చాలా బాగా ఆడుతున్నారు.ఇక ఇప్పుడు ఒక ప్లేయర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది… ఆయన ఎవరు అంటే ప్రస్తుతం న్యూజిలాండ్ టీమ్ లో ఆల్ రౌండర్ గా అద్భుతాలు చేస్తున్న రచిన్ రవీంద్ర ఈయన వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ టీమ్ కి అద్భుతమైన విజయాలను అందిస్తున్నాడు.ఇక దాంతో ఇండియన్ టీమ్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ తన బ్యాటింగ్ స్టైల్ కి బాగా ఇంప్రెస్స్ అయ్యాడు.దాంతో అతన్ని ముంబై ఇండియన్స్ టీమ్ లోకి తీసుకోవాలని టీమ్ యాజమాన్యం తో రోహిత్ మాట్లాడినట్టు గా తెలుస్తుంది…

ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఉన్న ఫామ్ కి ముంబై ఇండియన్స్ టీమ్ లో ఆయన ఉంటే టీమ్ కి చాలా బాగా హెల్ప్ అవుతాడు అంటూ రోహిత్ మాట్లాడినట్టు గా తెలుస్తుంది. లాస్ట్ టైం ముంబై టీమ్ పెద్దగా పర్ఫాం చేయలేదు దాంతో ఆ టీమ్ లోకి కొంతమంది ప్లేయర్లను తీసుకోవాలని చూస్తున్నారు అలాగే టీమ్ లో ఉన్న కొంతమంది ప్లేయర్లను రిప్లేస్ చేస్తూ రచిన్ రవీంద్ర ను తీసుకోవాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టు గా తెలుస్తుంది..

ఇక దాంట్లో భాగంగానే ముందుగానే రోహిత్ తనని తీసుకోబోతున్నట్లు గా తెలుస్తుంది… నిజానికి రచిన్ రవీంద్ర టీమ్ లో ఉంటే ఆయన చాలా కన్సిస్టెంట్ గా గేమ్ ఆడుతాడు కాబట్టి ఆయన టీమ్ కి ఉంటే టీమ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది…ఆయన లో ఒక క్లాస్ ఇన్నింగ్స్ అదే సత్తా ఉంది అలాగే లాంగ్ ఇన్నింగ్స్ అదే నేర్పు కూడా ఉంది ఇండియన్ టీమ్ కి కోహ్లీ ఎలానో న్యూజిలాండ్ టీమ్ కి ఫ్యూచర్ లో తను కూడా అలా మారుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు…