Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. కాగా తొమ్మిదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సోమవారం మొదలైంది.ఈ వారం కూడా ఎప్పటిలానే కంటెస్టెంట్స్ మధ్య వాదనలు,గొడవలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ రోజు కూడా కొనసాగనుంది. ఇక తాజాగా విడుదలైన ప్రోమో లో హౌస్ మేట్స్ నామినేషన్స్ లో అల్లాడించేస్తున్నారు. ముందుగా ప్రిన్స్ యావర్ నువ్వు ఫౌల్ గేమ్ ఆడావు అంటూ శోభా ని నామినేట్ చేశాడు. అందరూ ఫౌల్స్ చేశారు నువ్వు నన్ను మాత్రమే అంటున్నవ్ అని శోభా చెప్పింది. నేను నీ గురించి మాట్లాడుతున్నాను శోభా అని యావర్ చెప్పాడు.
యావర్ తన రెండో నామినేషన్ అశ్విని కి వేశాడు. దీంతో అశ్విని షాక్ అయింది. నేను నీ దగ్గర నుంచి ఇది ఊహించలేదు అని చెప్పింది. నీ డెసిషన్ నాకు నచ్చలేదు అని చెప్పాడు. ఇద్దరు వాదించుకున్నారు. ఇక శోభా శెట్టి తనని నామినేట్ చేసిన రతిక ని తిరిగి నామినేట్ చేసింది. రతిక డిఫెండ్ చేస్తూ నువ్వు సేఫ్ ఆడుతున్నావ్ .. ఆ వీడియోలో నువ్వు,తేజ మీరు ముగ్గురు ఉన్నారు అని చెప్పింది.దాంతో తేజ నన్ను మధ్యలోకి లాగొద్దు అంటూ రతిక పై ఫైర్ అయ్యాడు.
తర్వాత అమర్ దీప్ ప్రతి వారం లానే బోలె మీద పడ్డాడు. ఇక ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేశాడు. భోలే కి దండం పెట్టాడు. మీరు నన్ను నామినేట్ చేసిన పద్ధతి నాకు నచ్చలేదు .. అందుకే చాలా బాధతో మిమ్మల్ని నామినేట్ చేస్తున్న అని చెప్పాడు అమర్.దానికి భోలే అదిరిపోయే సమాధానం చెప్పాడు.
నేను ఈ హౌస్ లో ఇంత మంచి పేరు తెచ్చుకున్న అని భలే అంటే అబ్బో నువ్వు సూపర్ అన్న .. హీరో నువ్వు అంటూ అమర్ చెప్పాడు. నువ్వు అసలు ఈ హౌస్ లో ఏం సాధించావ్ … బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నావ్ అంటూ భోలే ఇచ్చి పడేసాడు. అవును నేను చెడ్డవాడినే… నీకేమైనా ప్రాబ్లమా అంటూ భారీ డైలాగులు కొట్టాడు అమర్ దీప్. ఇక చివర్లో అర్జున్,యావర్,ప్రశాంత్,శివాజీ నలుగురు కలిసి ‘ముస్తఫా.. ముస్తఫా ‘అంటూ పాట పాడారు.