https://oktelugu.com/

IND vs AUS : సిక్సర్ దూరం 100 మీటర్లు.. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ.. ఆస్ట్రేలియా పై విరుచుకు పడుతున్న రోహిత్!

IND vs AUS : 25 బంతుల్లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సహాయంతో దంచికొడుతూ సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు మరో ఎండ్ లో రిషబ్ పంత్ 13 బంతుల్లో 15 పరుగులు చేశాడు. ఇతడి ఇన్నింగ్స్ లో ఒక ఫోర్, ఒక సిక్సర్ ఉన్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 24, 2024 9:07 pm
    Rohit Sharma

    Rohit Sharma

    Follow us on

    IND vs AUS : టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా – ఆస్ట్రేలియా జట్లు వెస్టిండీస్ లోని సెయింట్ లూయిస్ వేదికగా సూపర్ -8 మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కడపటి వార్తలు అందే సమయానికి 7.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది.

    బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఓవర్ కట్టుదిట్టంగా వేసింది. స్టార్క్ తొలి ఓవర్ లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ మరుసటి ఓవర్ హాజిల్ వుడ్ వేశాడు. అయితే అతడు వేసిన షార్ట్ పిచ్ బంతిని అంచనా వేయని విరాట్ కోహ్లీ..లాంగ్ ఆన్ లోకి ఆడాడు. దానిని టిమ్ డేవిడ్ ఒడిసిపట్టాడు. దీంతో ఆరు పరుగుల వద్ద టీమ్ ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. విరాట్ గోల్డెన్ డక్ గా వెను తిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత రిషబ్ పంత్ మైదానంలోకి వచ్చాడు. కేవలం స్ట్రైక్ రొటేట్ చేశాడు..మరో ఎండ్ లో ఉన్న ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. బంతితో దీర్ఘకాలం శత్రుత్వం ఉన్నట్టు కసి కొద్దీ బాదాడు. ఈ దశలోనే 19 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. హజిల్ వుడ్, స్టార్క్, కమిన్స్ ఇలా ఎవర్ని కూడా వదల్లేదు. 19 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసిన రోహిత్ శర్మ.. టీ 20 వరల్డ్ కప్ లో అతి తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 5 ఓవర్లలోనే టీం ఇండియా 52 పరుగులు పూర్తి చేసుకోగా.. అందులో రోహిత్ వే 50 పరుగులు ఉండడం విశేషం.

    4.1 ఓవర్ లో హజిల్ వుడ్ బౌలింగ్ లో రోహిత్ కొట్టిన వేగానికి బంతి 100 మీటర్ల ఎత్తులో లేచింది.. ఈ సిక్స్ టీమిండియా ఇన్నింగ్స్ లో హైలెట్ గా నిలిచింది. ఆ బంతి ఏకంగా రూఫ్ ను తగిలింది. ఈ సిక్స్ ద్వారా టీ -20 క్రికెట్ చరిత్రలో 200 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. వాస్తవానికి టీమిండియా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వద్ద మైదానం తడిగా ఉందని కొద్దిసేపు ఆటను నిలిపివేశారు. ఆ తర్వాత రోహిత్ తన అసలు సిసలైన రూపాన్ని ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చూపించాడు. బౌలర్ ఎవరు అనేది లేక పెట్టకుండా దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. చాలా రోజులుగా సరైన ఇన్నింగ్స్ ఆడని రోహిత్.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో 19 బంతుల్లో అర్థ సెంచరీ చేసి టచ్ లోకి వచ్చాడు. 25 బంతుల్లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సహాయంతో దంచికొడుతూ సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు. మరో ఎండ్ లో రిషబ్ పంత్ 13 బంతుల్లో 15 పరుగులు చేశాడు. ఇతడి ఇన్నింగ్స్ లో ఒక ఫోర్, ఒక సిక్సర్ ఉన్నాయి.