Kalki 2898 AD : నాగ్ అశ్విన్ తన సినిమాల్లో మాళవిక నాయర్ ను పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే.?

Kalki 2898 AD : నాగ్ అశ్విన్ ఆమెను ప్రతి సినిమాలో తీసుకుంటున్నాడు. ఇక అందులో భాగంగానే కల్కి లో కూడా ఒక కీలక పాత్ర లో నటిస్తుంది.

Written By: NARESH, Updated On : June 24, 2024 8:57 pm

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD : ప్రస్తుతం కల్కి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్..ఈయన చేసిన గత రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ముఖ్యంగా ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి ‘ లాంటి సినిమాలతో ఒక టేస్ట్ ఉన్న డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఈయన…

ఇప్పుడు మాత్రం సైన్స్ ఫిక్షన్ జానర్ లో ప్రభాస్ పెట్టి సినిమాని తెరకెక్కించడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక అందులో భాగంగానే నాగ్ అశ్విన్ మాత్రం ప్రతి సినిమాలో మాళవిక నాయర్ ను ఏదో ఒక పాత్ర లో తీసుకుంటున్నాడు. దానికి గల కారణం ఏంటి అంటే ఆమె చాలా మంచి నటి అలాగే ఆమె షూటింగ్ స్పాట్ లో కూడా చాలా జెన్యూన్ గా ఉంటూ షూటింగ్ లోకేషన్ మొత్తాన్ని చాలా పాజిటివ్ గా ఉంచడానికి ప్రయత్నం చేస్తారట. అలాగే నాగ్ అశ్విన్ తన మొదటి సినిమా అయినా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాకి ఆమె బాగా సపోర్ట్ చేసిందంట.

నాగ్ అశ్విన్ కొంతవరకు కంగారుపడ్డప్పటికీ సినిమా స్టోరీ మొత్తం ఆమెకు తెలుసు కాబట్టి ఇబ్బంది లేకుండా నాగ్ అశ్విన్ కి కొన్ని సలహాలు సూచనలను కూడా ఇచ్చేదట.ఇక ఆమె చాలా ఇంటెలిజెంట్ అమ్మాయని ఒక సందర్భంలో నాగ్ అశ్విన్ తెలియజేశాడు. ఇక అందుకోసమే ఆమెని ప్రతి సినిమాలో రిపీట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆమె షూటింగ్ కొంచెం సేపు లేట్ అయిన కూడా ఇబ్బంది పడకుండా డైరెక్టర్ చెప్పినట్టు వింటూ సెట్లోనే ఉండి ఆరోజు కి అనుకున్న మొత్తం షాట్స్ పూర్తి అయిన తర్వాత వెళ్ళిపోతుందట.

తన బిహేవియర్ తోనే ఆమె చాలా ఆఫర్స్ ని అందుకుంటుందంటూ చాలామంది చెబుతున్నారు. అలాగే నాగ్ అశ్విన్ చేస్తున్న సినిమాల్లో ఆమెకి తగ్గట్టుగా ఏదైనా ఒక క్యారెక్టర్ ఉంటే ఆమెకి ఇస్తున్నాడు. ఇక ఆమె కూడా ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి నాగ్ అశ్విన్ ఆమెను ప్రతి సినిమాలో తీసుకుంటున్నాడు. ఇక అందులో భాగంగానే కల్కి లో కూడా ఒక కీలక పాత్ర లో నటిస్తుంది. ఇక వీళ్లిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనకు చాలా స్పష్టం గా తెలుస్తుంది…