India vs Australia : టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో సెయింట్ లూసియా వేదికగా జరుగుతున్న సూపర్ -8 మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. త్రుటిలో సెంచరీ కోల్పోయినప్పటికీ.. అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 92 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో అనేక ఘనతలను తన సొంతం చేసుకున్నాడు.
కెప్టెన్ల పరంగా..
ఒక కెప్టెన్ గా టి20 వరల్డ్ కప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ కొనసాగుతున్నాడు. 2010లో బ్రిడ్జి టౌన్ వేదికగా టీమిండియా తో జరిగిన మ్యాచ్ లో గేల్ 98 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటికే రికార్డుగా కొనసాగుతోంది.
గేల్ తర్వాతి స్థానాన్ని రోహిత్ శర్మ ఆక్రమించాడు. సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రోహిత్ 92 పరుగులు చేశాడు.
2009లో ఓవల్ జరిగిన వేదికగా ఆస్ట్రేలియాతో టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లో వెస్టిండీస్ ఆటగాడు గేల్ 88 పరుగులు చేశాడు.
2021లో దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టి20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ఆటగాడు విలియంసన్ 85 పరుగులు చేశాడు..
ఏకంగా 200 సిక్సర్లు
ఇక ఈ మ్యాచ్లో 8 సిక్సర్లు కొట్టడం ద్వారా రోహిత్ మరో రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఐసీసీ నిర్వహించే టి20 టోర్నీలలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఏకంగా 200 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా జట్టుపై ఏకంగా 130 సిక్సర్లు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ.. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు గేల్ తో సమానంగా నిలిచాడు. ఇంగ్లాండ్ జట్టుపై గేల్ ఏకంగా 130 సిక్సర్లు బాదాడు. గేల్ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. వెస్టిండీస్ జట్టుపై ఏకంగా 88 సిక్సర్లు కొట్టాడు.. న్యూజిలాండ్ జట్టుపై గేల్ 87 సిక్సర్లు కొట్టగా.. పాకిస్తాన్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది శ్రీలంకపై 86 సిక్సర్లు కొట్టాడు. ఇక రోహిత్ ఎనిమిది పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయినప్పటికీ.. అన్ని ఫార్మాట్లో కలిపి 19 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
రోహిత్ హైయెస్ట్ స్కోర్
టీ 20 వరల్డ్ కప్ లో సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియా పై జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ చేసిన 92 పరుగులు అతడి హైయెస్ట్ స్కోర్ గా ఉంది.. బ్రిడ్జి టౌన్ వేదికగా 2010లో ఆస్ట్రేలియా పై రోహిత్ 79* పరుగులు చేశాడు. 2021 లో ఆబుదాబి వేదికగా ఆఫ్ఘనిస్థాన్ పై 74 పరుగులు చేశాడు. 2014 లో మీర్ పూర్ వేదికగా వెస్టిండీస్ పై 62* పరుగులు చేశాడు.
ఆ స్థానాన్ని ఆక్రమించాడు
ఐసీసీ నిర్వహించే టీ -20 లలో భారత ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన పరంగా చూసుకుంటే.. సౌత్ ఆఫ్రికా మీద 2010లో సురేష్ రైనా 101 పరుగులు చేశాడు ..ఇప్పటి వరకు ఇదే హైయ్యెస్ట్ రికార్డుగా కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానాన్ని రోహిత్ శర్మ ఆక్రమించాడు. 2024 లో సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ 92 పరుగులు చేశాడు. వాంఖడే వేదికగా 2016 లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 89* పరుగులు చేశాడు. 2022 మోహలీ వేదికగా ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 82* పరుగులు చేశాడు. 2022 లో మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 82* పరుగులు చేశాడు.