Yashaswi Jaiswal : రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మూడో టెస్టులో భారత్ చారిత్రక విజయం సాధించింది. 434 పరుగుల తేడాదో బ్రిటిష్ జట్టును చిత్తు చేసింది. ఇక ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్. ఇంగ్లంట్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మొదటి నుంచే దుమ్ము రేపుతున్నాడు. వరుసగా రెండో డబుల్ సెంరచీ నమోదు చశాడు. వైజాగ్ టెస్టులో 209 పనుగులు చేసిన యశస్వి.. రాజ్‌కోట్‌లో 236 పరుగులు చేశాడు.
డబుల్ సెలబ్రేషన్స్..
రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌పై రెండో ఇన్సింగ్స్‌లో యశస్వి జైశ్వాల్ రెండుసార్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. టెస్టు మ్యాచ్‌ను వన్డే తరహాలో ఆడిన ఈ యువ క్రికెటర్ సెంచరీ చేసిన తర్వాత ఒకసారి సెలబ్రేషన్ చేసుకున్నాడు. తర్వాత డబుల్ సెంచరీ చేసిన తర్వాత మరోమారు సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే విశాఖలో, తాజాగా రాజ్‌కోట్‌లో సెలబ్రేషన్స్‌ను గమనించిన టీమిండియా సారథి రోహత్ శర్మ. రాజ్‌కోట్‌లో సెంచరీ చేసిన తర్వాత యశస్వి సెలబ్రేషన్స్‌ను గ్యాలరీలో ఉండి ఇమిటేట్ చేశాడు.
వీడియో వైరల్..
ఒకవైపు మైదానంలో యశస్వి ఎగిరి గెంతేసి.. ప్రేక్షకులకు ముద్దులు ఇస్తుండగా డ్రెస్సింగ్ రూంలో ఉన్న రోహిత్ శర్మ కూడా యశస్విని అనుకరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ ఇమినేటషన్ చూసి అక్కడే ఉన్న మిగతా ఆటగాళ్లు నవ్వుకున్నారు. డ్రెస్సింగ్ రూం మొత్తం నవ్వులు పూశాయి. ఈ వీడియో చూసిన నెటిజన్స్, క్రికెట్ అభిమానులు స్పందిస్తున్నారు. రోహిత్ చొరవను మెచ్చుకుంటున్నారు. సారథిగా కాకుండా సహచరుడిగా చేసిన ఇమిటేషన్ బాగుందని అభినందిస్తున్నారు. ఇలాంటి తీరు ఆటగాళ్లతో సత్సంబంధాలను పెంచుతుందని, డ్రెస్సింగ్ రూం వాతావరణాన్ని మారుస్తుందని పేర్కొంటున్నారు.
A leap of joy to celebrate his second century of the series
Well played, Yashasvi Jaiswal #TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/pdlPhn5e3N
— BCCI (@BCCI) February 17, 2024