Star Actor Son: వ్యవసాయం చేసుకుంటున్న స్టార్ నటుడి కుమారుడు..

అందరికి వర్తించదు అని నిరూపించారు ఓ స్టార్ కమెడియన్ కొడుకు. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా? ఆయన గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే వ్యవసాయం మాత్రం చేస్తూ ఎలాంటి ఆడంబరాలకు పోవడం లేదు ఆ కుమారుడు.

Written By: Swathi, Updated On : February 19, 2024 2:06 pm
Follow us on

Star Actor Son: కొంచెం డబ్బున్న కుటుంబం అయితే చాలు ఇంట్లో పిల్లలు రెచ్చిపోతారు. అణిగిమనిగి ఉండే వారు కొందరు అయితే రుబాబుగిరి చేసేవారు ఎందరో ఉంటారు. ఇక వీఐపీలు, వీవీఐపీలు, సెలబ్రెటీలు అయితే ఆ ఇంట్లో పిల్లలు కొందరు మరింత రెచ్చిపోతారు. ఇది అందరికి వర్తించదు అని నిరూపించారు ఓ స్టార్ కమెడియన్ కొడుకు. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా? ఆయన గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే వ్యవసాయం మాత్రం చేస్తూ ఎలాంటి ఆడంబరాలకు పోవడం లేదు ఆ కుమారుడు.

ఆ స్టార్ నటుడు తమిళ కమెడియన్ వడివేలు అయితే వ్యవసాయం చేసుకునేది ఆయన కొడుకు సుబ్రమణి. కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు కొన్ని వివాదాలు ఎదుర్కొని ఆ తర్వాత వరుస సినిమా చేస్తున్నారు. 23వ పులకేసి సినిమా హిట్ అయిన తర్వాత 24వ పులకేసి షూటింగ్ ప్రారంభించిన టైంలో వడివేలు డైరెక్టర్ శంకర్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వడివేలు పై నిర్మాతల సంఘం నిషేధం విధించింది. చాలా సంవత్సరాలుగా వడివేలు సినిమాలకు దూరమయ్యారు.

ఈ మధ్య వడివేలు ఎదుర్కొన్న సమస్య పరిష్కారం కావడంతో తిరిగి సినిమాల్లో బిజీ అయ్యారు. అంతేకాదు రీసెంట్ గా మామన్నన్ లో తన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే వడివేలు ఎప్పుడు ఎక్కడ తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించలేదు. కుటుంబ సభ్యుల గురించి కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే ఈ మధ్య కొడుకు సుబ్రహ్మణి పెళ్లి ఫోటోలు అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో జనాలందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

సుబ్రహ్మణ్యం ఎక్కడ ఉన్నారు? కొడుకును ఎందుకు సినిమాల్లోకి తీసుకురాలేదు అంటూ చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్రమణి ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు. వడివేలుకు ఒక కూతురు, కొడుకు ఉన్నారట. ఇద్దరికీ వివాహం జరిగింది. కొడుకును బంధువులకే ఇచ్చి పెళ్లి చేశారట. తనకి తండ్రి అంటే చాలా ఇష్టమని.. అందుకే ఆయన పేరే పిల్లలకు పెట్టుకున్నానని చెప్పారు. తన తండ్రికి ఏ విషయంలో అయినా సిఫారసు చేయడం ఇష్టం ఉండదట. అందుకే ఎక్కడ తండ్రి పేరు ఉపయోగించను అని చెప్పారు. అయితే తండ్రి వారసత్వంగా వచ్చిన పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న సుబ్రమణి తండ్రి సిటీకి పిలిచినా రాలేదట. నిజంగా ఇంత సింపుల్ గా ఉండడం గ్రేట్ కదా.