Akbar can’t be with Sita: “సీత, అక్బర్ రెండు వేరువేరు మతాలకు చెందిన వారి పేర్లు కదా.. అలాంటి పేర్లు పెట్టినవి పక్కపక్కనే ఎలా ఉంటాయి? వాటిని దగ్గర ఎలా ఉంచుతారు? ఇది మాకు పూర్తిగా అభ్యంతరకరమంటూ” అంటూ విశ్వహిందూ పరిషత్ కోర్టును ఆశ్రయించింది.. పై వాక్యాల్లో తప్పుంది గమనించారా? అక్బర్, సీత అనే పేర్లు స్త్రీ, పురుష లింగానికి సంబంధించినవి. అయినప్పటికీ రెండు పేర్లను స్త్రీ లింగంతో సంబోధించాం. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది.. అర్థం కాలేదా? అయితే ఆ పేర్ల వెనుక ఉన్న వివాదం ఏమిటో ఈ కథనం చదవండి మీకే తెలుస్తుంది..
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి అనే దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. దేశంలోనే అరుదైన క్రూర జంతువులు ఈ అడవిలో నివాసం ఉంటాయి. ఈ అడవిలో జంతువుల పరిరక్షణ కోసం అటవీశాఖ అధికారులు వివిధ రకాల చర్యలు తీసుకుంటారు. పర్యాటకపరంగా కూడా సఫారీ అనుభవాన్ని పర్యాటకులకు కల్పిస్తారు. తక్కువ దూరంలో అరుదైన జంతువులను చూసే అవకాశాన్ని అందిస్తారు. అయితే అలాంటి ఈ అడవిలో అటవీ శాఖ అధికారులు తీసుకున్న ఓ నిర్ణయం పెను వివాదాన్ని సృష్టించింది.
సిలిగురి అటవీ ప్రాంతంలో సఫారీ పార్క్ ఉంది. ఇందులో సింహాలను సంరక్షిస్తున్నారు. అయితే ఇక్కడ పార్కులోని ఆడ సింహానికి అటవీశాఖ అధికారులు సీత అని పేరు పెట్టారు. మగ సింహానికి అక్బర్ అని నామకరణం చేశారు. అయితే ఈ రెండు సింహాలను ఒకే దగ్గర ఉంచడం విశ్వహిందూ పరిషత్ నాయకులకు ఆగ్రహం తెప్పించింది. సీత అనే పేరు మాకు ఎంతో ప్రీతిపాత్రమైనదని.. అక్బర్ అనే పేరు మరో వర్గానికి చెందినదని.. అలాంటి భిన్నమైన పేర్లు ఉన్న జంతువులను ఒకే దగ్గర ఎలా ఉంచుతారని విశ్వహిందూ పరిషత్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అటవీ శాఖ అధికారుల తీరును విశ్వహిందూ పరిషత్ నాయకులు నిరసిస్తూ కోల్ కతా కోర్టును చేయించారు. జల్పాయిగురి బెంచ్ లో ఫిబ్రవరి 16న పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ ఫిబ్రవరి 20న జరగనుంది. అయితే దీనిపై అటవీశాఖ అధికారులు మరో విధంగా స్పందిస్తున్నారు. ఆ సింహాలకు తాము పేరు పెట్టలేదని.. వాటిని త్రిపుర నుంచి తీసుకొచ్చామని.. అవి క్రా*** కు రావడంతో ఒకే ఎన్ క్లోజర్ లో ఉంచామని ప్రకటించారు. ఈ వివాదం నేపథ్యంలో ఫిబ్రవరి 20న కోల్ కతా హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.