Zodiac: ప్రతి ఒక్కరి జీవితంలో శని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అయితే కొందరికి శనిదేవుడు అనుకూలంగా ఉంటే.. మరికొందరికి కష్టాలను తీసుకొస్తాడు. కొన్ని పురాణాలు, చరిత్ర ప్రకారం.. మనిషి తప్పు చేసినప్పుడు వారిని సక్రమ మార్గంలో ఉంచేందుకు కష్టాలను పెడుతారని అంటారు. అయితే శని ప్రభావం ఎక్కువగా ఉంటే పరిహార పూజలు చేయడం వల్ల కొన్ని బాధలు తగ్గుదాయి. ఇదే సమయంలో శనీశ్వరుడు దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఒక రాశిలో సంచిస్తారు. దీంతో ఈ రాశి కి సంబంధం ఉన్న మరికొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. ఆ తరువాత తిరోగమన సమయంలో కొన్ని రాశుల వారికి శుభం జరగనుంది. ఈ ఏడాది నవంబర్ లో శనీశ్వరుడు కుంభ రాశిలో ప్రయాణించడం ప్రారంభిస్తాడు. దీంతో ప్రత్యక్షంగా కొన్ని రాశుల వారికి అనుకూల ప్రయోజనాలు ఉన్నా.. మరికొందరికి మాత్రం వ్యతిరేక పవనాలు వీస్తాయి. అయితే ఆ అదృష్ట రాశులు ఏవో చూద్దాం..
శనీశ్వరుడు తన సంచారంతో కొందరికి మేలు చేస్తాడు. మరికొందరికి సక్రమ మార్గంలో నడిపించే క్రమంలో వారిని కష్ట పెడుతూ ఉంటాడు. శనీశ్వరుడు కుంభరాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల ఫలితాలు అద్భుతంగా ఉండనున్నాయి.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 15 నుంచి శనీశ్వరుడు కుంభ రాశిలో ప్రయాణించనున్నాడు. దీంతో మేష రాశి వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. ఈ రాశి వ్యాపరులు పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి.
ఎన్నో ఏళ్ల నుంచి కష్టాలను ఎదుర్కొంటున్న కన్యా రాశి వారికి నవంబర్ నుంచి మహర్దశ పట్టనుంది. ఇప్పటి నుంచి వీరు ఏ పని చేపట్టినా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా విహార యాత్రలు చేస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. సమస్యల నుంచి బయటపడుతారు.
మరో రాశి మకరానికి శనీశ్వరుడి తిరోగమనంతో అదృష్టం పట్టనుంది. ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా వీరు పుంజుకుంటారు. ఈ సమయంలో వీరు ఎలాంటి పెట్టుబుడులు పెట్టినా అవి సక్సెస్ అవుతూ ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అభివృద్ధి చెందాలని చూసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే కొందరు తమ పనులు పూర్తి చేయడానికి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
శనీశ్వరుడు కుంభ రాశిలో ప్రవేశించడంతో పై మూడు రాశులకు మహర్దశ పట్టినా.. కొన్ని రాశుల వారు కష్టాలు ఎదుర్కోక తప్పదు. అలాంటి రాశల్లో కర్కాటకం, మిథునం, వృషభం ఉన్నాయి. వీరు కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించడం మానుకోవాలి. కచ్చితంగా ప్రారంభించాల్సి వస్తే ఇతరుల పేరుమీద మొదలు పెట్టుకోవచ్చు. అయితే శనీశ్వరుడి ప్రభావం తక్కువగా ఉండాలంటే ఆయనకు సంబంధించిన ప్రత్యేక పూజలు నిర్వహించాలి. అలాగే ప్రతీ మంగళ, శనివారాల్లో శనీశ్వరుడికి తైలంతో అభిషేకం చేయడం వల్ల చల్లని చూపు ఉంటుందని పండితులు చెబుతున్నారు.