Rohit Sharma Birthday: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం నాటికి 38వ ఏట అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతని అభిమానులు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ లో క్షణం తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మ.. వీలు చిక్కినప్పుడల్లా అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది ముంబై జట్టు కెప్టెన్సీ కోల్పోయినప్పటికీ.. తన ఆటతీరులో ఏమాత్రం మార్పు కనిపించలేదు. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ ముంబై జట్టుకు భారీ స్కోరు అందించే ప్రయత్నం చేస్తున్నాడు. ధాటిగా ఆడే క్రమంలో అవుట్ అవుతున్నాడు. ప్రస్తుతం ముంబై జట్టు ఆశించినంత స్థాయిలో ఆడ లేకపోతోంది. పాయింట్ల పట్టికలో దిగివ స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ తో జరిగే మ్యాచ్ కోసం ముంబై జట్టు ఆటగాళ్లు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ముంబై జట్టు ఆటగాడు రోహిత్ శర్మ అభిమానులను అలరించాడు.
రోహిత్ శర్మ తల్లి సొంత ప్రాంతం విశాఖపట్నం జిల్లా. అయితే రోహిత్ శర్మ తండ్రిని వివాహం చేసుకొని ఆమె మహారాష్ట్రలో స్థిరపడింది. తన తల్లిది తెలుగే అయినప్పటికీ.. రోహిత్ శర్మ కు పెద్దగా తెలుగు రాదు. హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్ నేపథ్యంలో.. సోమవారమే నగరంలోకి ముంబై జట్టు అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో కొంతమంది తెలుగు అభిమానులు రోహిత్ శర్మను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారితో తెలుగులో మాట్లాడారు. “అభిమానులు ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేను ఐపీఎల్ ఆడేందుకు హైదరాబాద్ వచ్చాను” అంటూ రోహిత్ శర్మ వచ్చీ రాని తెలుగులో మాట్లాడాడు. ఈ వీడియో బయటకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. మంగళవారం రోహిత్ శర్మ 38వ ఏట అడుగు పెడుతున్న నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మరో కొద్ది రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. భారత జట్టుకు ఆ ట్రోఫీ అందించి పుట్టినరోజు బహుమతిగా ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు . కాగా, తెలుగు అభిమానులతో మాట్లాడుతున్నంత సేపు రోహిత్ శర్మ చాలా ఉత్సాహంగా కనిపించాడు. వారితో జోకులు వేసుకుంటూ సరదాగా గడిపాడు. దీనికి ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. ఎంపిక చేసిన కొంతమంది అభిమానులను మాత్రమే రోహిత్ శర్మను కలిసేందుకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.. రోహిత్ శర్మ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hitman ఫ్యాన్స్.. ఈ వీడియో మీకోసమే @ImRo45 తెలుగు వింటుంటే ఏమన్నా ఫీలుందా అసలు ❤#HappyBirthdayRohitSharma #RohitSharma #Hitmanpic.twitter.com/TJmhNJyvcZ
— StarSportsTelugu (@StarSportsTel) April 30, 2024