Majili Movie Child Artist: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్క్రీన్ మీద బెస్ట్ కపుల్స్ గా గుర్తింపు పొందిన వారిలో నాగచైతన్య-సమంత ల జంట ఒకటి… అయితే వీళ్ళు ‘ఏ మాయ చేసావే’ సినిమాతో బెస్ట్ జోడిగా గుర్తింపు పొందారు. ఇక ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం లాంటి సినిమాలతో కూడా తమ కంటు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు. ఇక వీళ్లిద్దరూ ప్రేమించుకొని 2017వ సంవత్సరం పెళ్లి కూడా చేసుకున్నారు.
అయితే పెళ్లి తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ లో నాగచైతన్య హీరోగా సమంత హీరోయిన్ గా వచ్చిన మజిలీ సినిమా ఒక క్లాసికల్ హిట్ సినిమాగా మిగిలిపోయింది. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా వీళ్ళకి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇక ఈ సినిమాలో సమంత క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక భర్త తనకి అలాంటి భార్య దొరకాలని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే వీళ్లతో పాటుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మీరా క్యారెక్టర్ లో ఆ అమ్మాయి హావభావాలు సూపర్ గా ఉంటుంది.ఈ సినిమాలో నాగచైతన్య మాజీ లవర్ కూతురుగా మీరా నటించిన నటన ప్రేక్షకులందరిని మెప్పించిందనే చెప్పాలి… అయితే ఈ అమ్మాయి అసలు పేరు ‘అనన్య అగర్వాల్’ 2004 వ సంవత్సరం లో ముంబైలో ఈమె పుట్టింది.
అయితే ఈమె మొదట టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. ఇక మొదటగా తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్న తో టీవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇక అక్కడి నుంచి సీరియల్స్ లో కూడా చేయడం మొదలుపెట్టింది. వరుసగా మహాభారత్, సియా కే రామ్ వంటి సీరియల్స్ లో నటించింది. ఇక వీటితో పాటుగా కొన్ని ఆడ్ ఫిలిమ్స్ లో కూడా నటించి తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంది.
ఇక దాంతో శివ నిర్వాణ ఆమె టాలెంట్ ని చూసి ఆమెకి మజిలి సినిమాలో అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఈ సినిమా చేసిన తర్వాత ఆమెకు మంచి పేరు అయితే వచ్చింది. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు 20 సంవత్సరాల వయసులో ఉన్న ఈ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా కాకుండా హీరోయిన్ గానే ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…ఇక ప్రస్తుతం ఈ అమ్మడు టెలివిజన్ లో రాణిస్తూనే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో పలు రకాల బ్రాండ్లకు ప్రమోషన్స్ ని కూడా చేస్తూ భారీగా డబ్బులను సంపాదిస్తుంది…