Rishabh Pant: ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ కు సంబంధించి కెప్టెన్ గా రిషబ్ పంత్ (Rishabh pant) ను లక్నో సూపర్ గేయింట్స్( Lucknow super gaints) ప్రకటించింది. సోమవారం కోల్ కతా లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో లక్నో జట్టు యజమాని సంజీవ్ గొయెంకా ఈ విషయాన్ని ప్రకటించారు. గత సీజన్లో లక్నో జట్టు యాజమాన్యానికి, కెప్టెన్ కేఎల్ రాహుల్ కు వివాదం జరిగింది.. దీంతో రాహుల్ జట్టు నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఫలితంగా లక్నో జట్టు ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో రిషబ్ పంత్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది.
సోమవారం కోల్ కతా లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వచ్చే ఐపీఎల్ సీజన్ లో లక్నో జట్టు కెప్టెన్ గా రిషబ్ పంత్ ను నియమిస్తున్నట్టు.. లక్నో జట్టు యజమాని సంజీవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో రిషబ్ పంత్ మాట్లాడారు..” లక్నో జట్టు కెప్టెన్ గా నియమితుడవడం ఆనందంగా ఉంది. ఈ సీజన్ లో లక్నో జట్టును ముందుండి నడిపించే సామర్థ్యం ఉంటుందని అనుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన లక్నో జట్టు యాజమాన్యానికి ధన్యవాదాలు.. నేను చాలామంది కెప్టెన్ల ఆధ్వర్యంలో పనిచేసాను. మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ సారథ్యంలో ఆడాను. వారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఒక ఆటగాడిని ఎలా గౌరవించాలో.. అతడిలో ఉన్న శక్తి సామర్థ్యాలను జట్టుకు ఎలా ఉపయోగించుకోవాలో రోహిత్ నుంచి గ్రహించాను. ఒక పని మీద మాత్రమే మనసు లగ్నం చేయి. అందులో జయాపజయాల గురించి పక్కన పెట్టు. అంతిమ ఫలితాలు అవే వస్తాయని మహేంద్రసింగ్ ధోని చెప్పేవారు. ఆ మాటల నుంచి చాలా స్ఫూర్తి పొందాను. అలా స్ఫూర్తి పొంది ఐపీఎల్ లో ఢిల్లీ జట్టును నడిపించాను. ప్రస్తుతం జట్టు మాత్రమే మారాను. ఆట అలానే ఉంటుంది. ఆట ఎప్పటికీ నాతోనే ఉంటుంది. అందువల్లే అంత గాయాలైనా సరే ఆటను మర్చిపోలేదు. ఆటను కొనసాగిస్తూనే ఉన్నానని” రిషబ్ వ్యాఖ్యానించాడు.
సోషల్ మీడియాలో సంచలనం
మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మను ఉద్దేశించి రిషబ్ పంత్ కీలక వ్యాఖ్యలు చేయడంతో.. సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు.. రిషబ్ పంత్ ను ఉద్దేశించి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ” నువ్వు బంతి లాంటోడివి. ఎలాగైనా ఎగర గలవు. ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలవు. ఆ ధైర్యం నీకు ఇద్దరు కెప్టెన్లు ఇచ్చారంటే మామూలు విషయం కాదు. వారి నుంచి నేర్చుకున్నది నువ్వు బయటపెట్టావ్. నాయకుడిగా ఇంతకంటే మరిన్ని శక్తి సామర్థ్యాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అతడు ఈ సీజన్లో లక్నో జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని ఆశిస్తున్నామని ” నెటిజన్లు పేర్కొంటున్నారు.