Nara Lokesh: కూటమిలో అడ్డగోలు చీలిక రానుందా? విభేదాల పర్వం ప్రారంభమైందా? లోకేష్( Lokesh) కు డిప్యూటీ సీఎం ఇస్తే కార్యరూపం దాల్చనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. వైసిపి అలానే జరగాలని ఆశపడుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది. పటిష్ట సమన్వయంతో మూడు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. పరస్పరం గౌరవించుకుంటూనే సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే మూడు పార్టీల మధ్య కొనసాగుతున్న ఈ సమన్వయం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. తమ మధ్య గొడవలు జరిగితే వైసీపీకి లాభం అని మూడు పార్టీలు ఒక కార్యాచరణతో ముందుకు వెళుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే డిప్యూటీ సీఎం గా లోకేష్ ను ప్రకటించాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీ నుండి వినిపిస్తుండడం విశేషం.
* సమన్వయంతో కూటమి
సీఎంగా చంద్రబాబు( CM Chandrababu), ఏకైక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ చివరి వరకు కొనసాగుతారని అంతా భావించారు. కానీ ఇప్పుడు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తుండడం.. నేతలు వరుస పెట్టి ఇదే డిమాండ్ చేస్తుండడంతో ఏదో జరుగుతోందన్న అనుమానం బలపడుతోంది. తొలుత మహాసేన రాజేష్ ఈ డిమాండ్ చేశారు. తరువాత బుద్ధ వెంకన్న, అటు తరువాత కాలువ శ్రీనివాసులు, తాజాగా పిఠాపురం వర్మ ఈ డిమాండ్ చేయడం విశేషం. అయితే ఇలా డిమాండ్ చేస్తున్న నేతల్లో చాలామంది జనసేనకు వ్యతిరేకులుగా పేరు ఉంది. దీంతో అందరిలోనూ ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. కూటమిలో విచ్ఛిన్నం రావడానికి ఈ అంశం కారణమవుతుందన్న టాక్ వినిపిస్తోంది.
* వ్యూహంలో భాగమా?
అయితే ఇదంతా చంద్రబాబు( Chandrababu) వ్యూహంలో భాగంగానే జరుగుతోందా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు అనుమతి లేనిదే టిడిపి నేతలు ఇటువంటి ప్రకటనలు చేసేందుకు సాహసించరు. టిడిపిలో ఒక విధానం నడుస్తోంది. ఏదైనా పని చేసే ముందు అనుకూల మీడియా ద్వారానైనా.. లేకుంటే అనుకూల టిడిపి నేతలతోనైనా మాట్లాడించే అలవాటు ఉంది. మొన్నటికి మొన్న ఏబీఎన్ రాధాకృష్ణ ఇదే విషయంపై రాసుకోచ్చారు. తన వారాంతపు కామెంట్స్ లో.. కచ్చితంగా లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ఎంపిక చేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ఇదే మంచి సమయమని కూడా ఆయన అన్నారు. అయితే ఇప్పుడు క్రమేపి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ టిడిపిలో పెరుగుతోంది. అయితే ఇదంతా చంద్రబాబు వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కచ్చితంగా పవన్తో ఆలోచన చేసి ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
* వైసిపి ఆశ అదే
అయితే కూటమిలో( Alliance ) ఎప్పుడెప్పుడు విభేదాలు వస్తాయా? అని కాచుకొని వైసీపీ కూర్చుంది. కూటమి పార్టీల మధ్య విభేదాలు వస్తే.. ప్రభుత్వపరంగా వీక్ అవుతారని.. పబ్లిక్ లో కూడా పలుచన అవుతారని వైసీపీ భావిస్తోంది. అయితే చంద్రబాబు ముందస్తు వ్యూహంలో భాగంగానే.. పవన్ తో ఆలోచించిన తర్వాతనే.. లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనే ఆలోచనకు వస్తే మాత్రం.. వైసీపీ ఆశలు నీరు గారుతాయి. మరోసారి ఆ పార్టీ అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.