Rishabh panth : ఐపీఎల్ (IPL)లో భాగంగా లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్(Lucknow super giants), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తలపడుతున్నాయి.. టాస్ గెలిచిన ముంబై జట్టు లక్నో జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది.. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు లాస్ అయ్యి 203 పరుగుల స్కోర్ చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్(60), మార్క్రం(53), ఆయుష్ బదోని(30), డేవిడ్ మిల్లర్ (27) ఆకట్టుకున్నారు.. లక్నో జట్టు భారీ స్కోర్ చేయడంలో వీరంతా తమవంతు పాత్ర పోషించారు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐదు వికెట్లు పడగొట్టాడు.
Also Read : శభాష్ పంత్.. నీ గొప్ప మనసు కు ఇదే ఉదాహరణ.. వైరల్ వీడియో
మళ్లీ విఫలమైన పంత్
లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు. ఐపీఎల్ సీజన్లో అతడు పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్లో డక్ అవుట్ అయిన అతడు.. తదుపరి మ్యాచ్లో 15 పరుగులు చేశాడు. ఆ తర్వాత మ్యాచ్లో రెండు పరుగులు మాత్రమే చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రెండు పరుగులు మాత్రమే చేసి.. హార్థిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న అతడు రెండు పరుగులు మాత్రమే చేయడంతో సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలకు గురవుతున్నాడు.. 27 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే చేసేది రెండు పరుగులా అంటూ లక్నో జట్టు అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ” 27 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. కనీసం ఇంతవరకు ఆడిన నాలుగు మ్యాచ్ లలో స్కోర్ మొత్తం కలిపినా 27 పరుగులు కాలేదు. ఇందుకేనా నిన్ను అన్ని డబ్బులు పెట్టి కొనుగోలు చేసింది.. ఇంతకీ నువ్వు ఎలా ఆడుతున్నావో అర్థం అవుతుందా.. జట్టు విజయంలో కీలక భాగస్వామి కావాల్సిన నువ్వు.. ఇలాంటి ఆటతీరు ప్రదర్శిస్తున్నామంటే మామూలు విషయం కాదని” సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. మరోవైపు రిషబ్ పంత్ రెండు పరుగులు చేసిన నేపథ్యంలో లక్నో జట్టు యజమాని సంజీవ్ గొయెంకా(Sanjeev goyanka) నుంచి ఏ స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో.. ఊహించుకుంటేనే భయం వేస్తోందని లక్నో అభిమానులు వాపోతున్నారు.. ఇప్పటికే సంజీవ్ ధాటికి కేఎల్ రాహుల్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. రిషబ్ పంత్ రెండు పరుగులకే అవుట్ కావడంతో.. సోషల్ మీడియాలో అతనిపై విపరీతంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత నాలుగు మ్యాచ్లలో అతడు చేసిన పరుగులను టేబుల్ రూపంలో పొందుపరిచి.. మీమర్స్ రిషబ్ పంత్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇప్పటివరకు చేసిన పరుగులను మొత్తం కలిపినా 27 కాలేదని ఎద్దేవా చేస్తున్నారు.
Also Read : అది ధోని క్రేజ్ అంటే.. కోహ్లీ, రోహిత్ కూడా సైడ్ అయిపోయారు!