Homeక్రీడలుక్రికెట్‌Rishabh Pant: సస్పెన్స్ కు తెర.. LSG కెప్టెన్ ను ప్రకటించిన సంజీవ్ గోయెంకా..

Rishabh Pant: సస్పెన్స్ కు తెర.. LSG కెప్టెన్ ను ప్రకటించిన సంజీవ్ గోయెంకా..

Rishabh Pant: సస్పెన్స్ వీడింది. ఎవరు అనే ప్రశ్నకు సమాధానం లభించింది. మొత్తానికి ఐపీఎల్ 2025 సీజన్లో (IPL 2025 season) లో లక్నో జట్టు కొత్త కెప్టెన్ ను నియమించుకుంది. దీంతో ఇప్పటివరకు ఐపీఎల్లో 8 జట్లకు కెప్టెన్లు నియమితులయ్యారు. సన్ రైజర్స్ హైదరాబాద్(sun risers Hyderabad)కు పాట్ కమిన్స్ (pat cummins), ముంబై ఇండియన్స్ (Mumbai Indians), హార్దిక్ పాండ్యా (Hardik Pandya), (Gujarat Titans), గుజరాత్ టైటాన్స్ కు శుభ్ మన్ గిల్ (Shubh Man gil), రాజస్థాన్ రాయల్స్ కు (Rajasthan royals), సంజు శాంసన్ (Sanju Samson), చెన్నై సూపర్ కింగ్స్ కు (Chennai super kings) రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad), కింగ్స్ 11 పంజాబ్ కు( kings eleven Punjab) (pbks)కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్(shreyas Iyer) ఎంపికయ్యారు. ఇంకా మిగతా జట్లకు కెప్టెన్లు ఎంపిక కావాల్సి ఉంది.

గత సీజన్లో లక్నో జట్టు కెప్టెన్ కేల్ రాహుల్, ఆ జట్టు యజమాని సంజీవ్ గొయెంకా మధ్య విభేదాలు తలెత్తాయి. దీనికి తోడు ఆ సీజన్లో ఆ జట్టు సరైన ఆట తీరు ప్రదర్శించలేదు. దీంతో ఆ జట్టు నుంచి రాహుల్ బయటికి వెళ్లిపోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. అందరూ ఊహించినట్టుగానే రాహుల్ ను లక్నో యాజమాన్యం బయటికి పంపించింది. దీంతో కొత్త కెప్టెన్ ఆ జట్టుకు వస్తాడని ప్రచారం జరిగింది. అప్రచారానికి తగ్గట్టుగానే మెగా వేలంలో రిషబ్ పంత్ ను భారీ ధరకు మెగా వేలంలో లక్నో జట్టు కొనుగోలు చేసింది. ఆ జట్టు యాజమాన్యం ఇన్నాళ్లపాటు కెప్టెన్ విషయంలో తర్జనభర్జన పడింది. చివరికి సోమవారం తన కెప్టెన్ ఎవరో ప్రకటించింది. కోల్ కతా లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో లక్నో జట్టు యజమాని సంజీవ్ తన జట్టు కెప్టెన్ ఎవరనేది వెల్లడించారు. 2025 సీజన్ లో జట్టును రిషబ్ పంత్ ముందుకు నడిపిస్తారని ప్రకటించారు.

గత సీజన్లో ఢిల్లీ జట్టుకు..

గత సీజన్లో ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహించాడు. ఐపీఎల్ కంటే ముందు అతడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన తర్వాత సుదీర్ఘకాలం ఆసుపత్రికి పరిమితమయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం.. కొంతకాలం పాటు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లోనూ చికిత్స పొందాడు. చికిత్స పొందిన అనంతరం కొంతకాలం ఫిజియోల ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. చివరికి అంతా బాగుంది అనుకున్న తర్వాత మైదానంలోకి దిగాడు. సుదీర్ఘకాలం ఆసుపత్రికి పరిమితమైనప్పటికీ తన పూర్వపు ఆటను ప్రదర్శించాడు. మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. దూకుడుగా జట్టును ముందుకు నడిపించాడు. అదే ఊపు టి20 వరల్డ్ కప్ లోనూ కొనసాగించాడు. అయితే ఢిల్లీ జట్టు ఎందుకనో అతడిని రిటైన్ చేసుకోలేకపోయింది. దీంతో అతడు మెగా వేలంలోకి రావాల్సి వచ్చింది. భారీ ధరకు లక్నో జట్టు కొనుగోలు చేసింది. అందరూ ఊహించినట్టుగానే కెప్టెన్ గా నియమించింది. 2025 సీజన్ లో రిషబ్ పంత్ లక్నో జట్టుకు నాయకత్వం వహిస్తాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular