Saif Ali Khan : ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే…షారుఖ్ ఖాన్ (Sharukh Khan), సల్మాన్ ఖాన్(Salman Khan), అమీర్ ఖాన్(Ameer Khan) లాంటి హీరోలతో పాటుగా సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) కూడా చాలా మంచి గుర్తింపుని తెచ్చుకొని తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటు ముందుకు సాగుతున్నాడు…
బాలీవుడ్ నటుడు అయినా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) మీద జనవరి 16వ తేదీ అర్ధరాత్రి దాడి జరిగిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మూడు రోజుల నుంచి పోలీసులు తీవ్రంగా శ్రమించి ఆ నిందితుడిని పట్టుకున్నారు. ఇక మొత్తానికైతే నిందుతుడు బంగ్లాదేశ్ కి చెందిన ‘మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజద్’ (Mahammod shariful Islam shahajad) గా పోలీసులు గుర్తించారు. మరి ఏది ఏమైనా కూడా ఈ నిందితుడు 8 వ అంతస్తు వరకు మెట్ల మార్గంలో పైకి వచ్చి అక్కడి నుంచి పైపులు పట్టుకొని 12వ అంతస్తులో ఉన్న సైఫ్ అలి ఖాన్ (Saif Ali Khan) ప్లాట్ లోకి ప్రవేశించాడు. ఇక మొదట సైఫ్ అలీ ఖాన్ చిన్న కొడుకుని టార్గెట్ చేసిన ఈ నిందితుడు డబ్బులు కావాలని గోడవ చేశాడు. దాంతో ఏదో డిస్టర్బెన్స్ అవుతుందని తెలిసుకున్న సైఫ్ అలీ ఖాన్ బయటికి రావడంతో అతని చిన్న కొడుకు కేర్ టేకర్ తో ఆ నిడుతుడు గొడవ పడుతూ కనిపించాయి.
దాంతో సైఫ్ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఆ సందర్భంలో ఆ నిందితుడు సైఫ్ అలీ ఖాన్ ను కత్తి తో పొడి చేశాడు… ఇక ఇదిలా ఉంటే మొత్తానికైతే పోలీసులు అతన్ని పట్టుకొని ఒక పెద్ద నిందితుడిని కోర్టు ముద్దు సబ్మిట్ చేశారు. అయితే మహమ్మద్ షరిపుల్ ఇస్లాం ఈ దాడి చేయడానికి అసలు కారణం ఏంటంటే…బంగ్లాదేశ్ లో చేయడానికి పని లేక ఇలా దొంగ గా మారినట్లు గా తెలియజేశాడు… మరి ఏది ఏమైనా కూడా సైఫ్ అలీ ఖాన్ ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకొని చికిత్స తీసుకుంటున్నాడు…
ఇక మరికొద్ది రోజుల్లో తను కోలుకుంటాడని వైద్యులు తెలియజేయడంతో సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులతో పాటు అతని అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరి మొత్తానికైతే సెలబ్రిటీలు వాళ్ల ఇంటికి కూడా రక్షణ లేకుండా ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ప్రతి ఒక్క సెలబ్రిటీ చాలా వరకు సెక్యూర్ గా ఉండాలని చాలామంది ప్రముఖులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక నిందితుడు సెలబ్రిటిలను టార్గెట్ చేస్తూ కొద్ది రోజుల నుంచి తిరుగుతు ఆయన మీద దాడి చేశాడు…కాబట్టి ఇక మీదట సెలబ్రిటీల ఇంటి చుట్టూ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని కూడా సెలబ్రిటీలందరికి ముంబాయి పోలీసులు సూచినట్టుగా తెలుస్తోంది…