Crime News : ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ బెల్లం వ్యాపారం ఒక రేంజ్ లో జరుగుతుంది. ఈ ప్రాంతంలో అకోజు బ్రహ్మాజీ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడికి భార్య, పిల్లలు ఉన్నారు. కాకపోతే బ్రహ్మాజీకి విపరీతమైన వ్యసనాలు ఉన్నాయి. బ్రహ్మాజీ పైకి అమాయకంగా కనిపిస్తాడు కాని.. లోపల ఇతడు చేసే వ్యవహారాలు ఒక రేంజ్ లో ఉంటాయి. పైగా ఇతడు పథకానికి బ్రాండ్ అంబాసిడర్. సొంత ఊర్లో చేసిన ఘనకార్యాలు చాలానే ఉన్నాయి. దీంతో అక్కడ ముఖం చిలక పోవడంతో విశాఖపట్నం జిల్లాలోని అల్లిపురం ప్రాంతానికి వెళ్లిపోయాడు. అక్కడ సింహాల దేవుడు వీధిలో ఒక ఇంట్లో అద్దెకు ఉండడం మొదలు పెట్టాడు. సులభంగా డబ్బు సంపాదించడానికి అతడు దొంగతనాలను ఎంచుకున్నాడు. పగలు మొత్తం ఆయా ఆలయాలకు వెళ్తుంటాడు. సామాన్య భక్తుడి లాగా కనిపిస్తున్నాడు. ఆలయం మొత్తం తిరిగి ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా రెక్కి నిర్వహిస్తుంటాడు. అక్కడి అర్చకుడితో మాటలు కలుపుతుంటాడు. హుండీ, వచ్చే ఆదాయం, డబ్బును భద్రపరిచే విధానం ఇవన్నీ తెలుసుకుంటాడు. ఆ తర్వాత అసలు ప్లాన్ మొదలు పెడతాడు. రాత్రిపూట మారువేషంలో వెళ్లి చోరీలకు పాల్పడుతుంటాడు.
Also Read : ఈ దొంగ స్టైలే వేరు.. దృశ్యం సినిమా తరహాలో చోరీలు.. చివరికి పోలీసులకు ఎలా చిక్కాడంటే?
ఇటీవల విశాఖపట్నంలోని ఒకటవ పట్టణ పరిధిలోని వుడ్ యాడ్ స్ట్రీట్ లో దుర్గాలమ్మ ఆలయంలో నూతన పూజారిని నియమించేందుకు నిర్వాహకులు ప్రకటన చేశారు. ఆ ప్రకటన చూసిన బ్రహ్మాజీ వెంటనే నిర్వాహకులను సంప్రదించాడు. తనను తాను బ్రాహ్మణుడిగా పరిచయం చేసుకున్నాడు. తనకు ఉద్యోగం అవసరమని వారిని కోరాడు. నీతో ఆలయ నిర్వాహకులు ఆఖరికి ఆ బాధ్యతను అప్పగించారు. అంతేకాదు ఆలయ తాళాలు అన్ని అందించారు. ఇక అదే రోజు ఆలయంలోకి బ్రహ్మాజీ వెళ్ళాడు. అమ్మవారికి పూజలు చేయడానికి పూలు, పండ్లు తేవాలని ఆలయ నిర్వాహకులను కోరాడు. ఇక అప్పటికే తన వెంట తెచ్చుకున్న సంచిలో అమ్మవారికి కిరీటం, ఆభరణాలు తీసుకొని వెళ్ళిపోయాడు. దీంతో విషయాన్నీ గుర్తించిన ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు అన్ని విధాలుగా దర్యాప్తు చేసి చివరికి బ్రహ్మాజీని పట్టుకున్నారు.. బ్రహ్మాజీని పోలీసులు విచారిస్తే అతని నేరాల చిట్టాను మొత్తం బయటపెట్టాడు.. మొత్తం 10 ఆలయాలలో అతడు చోరీలు చేసినట్టు ఒప్పుకున్నాడు.. విశాఖపట్నం ఒకటో పట్టణంలో మూడు నేరాలతో పాటు, మల్కాపురం ప్రాంతంలో రెండు, భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రెండు చోరీలకు బ్రహ్మాజీ పాల్పడ్డాడు. పెందుర్తి, కంచరపాలెం, చోడవరం ప్రాంతంలోని ఆలయాల్లో అతడు చోరీలకు పాల్పడ్డాడు. బ్రహ్మాజీ నుంచి 2900 గ్రాముల సిల్వర్, 7.6 గ్రాముల గోల్డ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. .