India Vs Australia: విరాట్ కోహ్లీ చేసింది ముమ్మాటికి తప్పేనని ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఈ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. ” విరాట్ కోహ్లీ చేసింది తప్పు. అలా చేసి ఉండకూడదు. అది ఐసీసీ ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా ఉంది. మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకుంటే విరాట్ సిడ్ని వేదికగా జరిగే చివరి టెస్ట్ ఆడే అవకాశం లేదు. విరాట్ కోహ్లీ కూడి వైపు నడుచుకుంటూ వచ్చాడు.. అతడి భుజాన్ని తాకడానికి దూకుడుగా వచ్చాడు.. అలా అతడు రావడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఫీల్డర్లు ఆ దశలో బ్యాటర్ కు సమీపంలో ఉండకూడదు. మైదానంలో ప్రతి ఫీల్డర్ ఎక్కడ సమావేశం అవుతారో, ఎక్కడ దూరంగా ఉంటారు అందరికీ తెలుసని” పాంటింగ్ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఐసీసీ 2.12 చట్టం ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్లో ఒక ఆటగాడు.. మరొక ఆటగాడికి భౌతికంగా ఇబ్బంది కలిగించినా.. లేదా దాడికి ప్రయత్నించినా చర్యలు తీసుకునే అవకాశం మ్యాచ్ రిపరికి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న మెల్ బోర్న్ టెస్టులో మ్యాచ్ రిఫర్ గా పై క్రాఫ్ట్ ఉన్నాడు. ఇతడు జింబాబ్వే మాజీ ఆటగాడు. ఒకవేళ విరాట్ కోహ్లీ చేసింది లెవెల్ -2 నేరంగా అతడు భావిస్తే విరాట్ మూడు లేదా నాలుగు డి మెరిట్ పాయింట్లను పొందుతాడు. నాలుగు డి మెరిట్ పాయింట్లు గనుక విరాట్ కోహ్లీ పొందుతే అతడు సిడ్ని టెస్ట్ ఆడేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ ఈ నేరాన్ని లెవెల్ -1 గా మ్యాచ్ రిఫరీ భావిస్తే.. విరాట్ కోహ్లీ తన మ్యాచ్ ఫీజులో కొంత మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.
గతంలో కూడా..
విరాట్ కోహ్లీ ఇప్పుడే కాదు.. గతంలోనూ ఒక ఆటగాడి భుజాన్ని తాకాడు. 2019లో బెంగళూరులో దక్షిణాఫ్రికా తో టీమిండియా టి20 మ్యాచ్ ఆడింది. ఆ సమయంలో దక్షిణాఫ్రికా ఆటగాడు బ్యూరాన్ హెండ్రిక్స్ భుజాన్ని విరాట్ కోహ్లీ తగిలాడు. ఆ సమయంలో అతడు ఒక డి మెరిట్ పాయింట్ పొందాడు. తను చేసింది తప్పు అని విరాట్ కోహ్లీ అంగీకరించాడు. ఆటగాళ్లు రెండు సంవత్సరాల వ్యవధిలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డి మెరిట్ పాయింట్లను కనుక పొందితే కొంతకాలం క్రికెట్ నుంచి నిషేధానికి గురవుతారు. ఆ తర్వాత ఆటగాడి ప్రవర్తన సక్రమంగా ఉంటే.. ఐసీసీ నియమించిన క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆటగాడి భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
గతంలో పై క్రాఫ్ట్ ఏం చేశాడంటే
2023 మార్చిలో జరిగిన ఓ మ్యాచ్లో టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా బంతిని మరో ఆటగాడు మహమ్మద్ సిరాజ్ చేతి వెనుక నుంచి కొంత క్రీమ్ రాశాడు. రవీంద్ర జడేజా తన ఎడమ చూపుడువేలు తో బంతిని రుద్దడం మ్యాచ్ రిఫరీకి కనిపించింది. ఈ విషయంపై జడేజాను రిఫరీ ప్రశ్నించగా.. అది రిలీఫ్ క్రీమ్ అని జడేజా, టీం మేనేజ్మెంట్ పై క్రాఫ్ట్ కు చెప్పారు. అయితే ఆ విషయంలో పై క్రాఫ్ట్ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
బాక్సింగ్ డే టెస్టులో టీమ్ ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కొన్ స్టాస్ ను స్లెడ్జింగ్ చేశాడు. అతడి భుజాన్ని తాకుకుంటూ వచ్చాడు.. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. #BoxingDayTest #AUSvIND pic.twitter.com/n3K94AsvQX
— Anabothula Bhaskar (@AnabothulaB) December 26, 2024