Rohit Sharma: ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు జట్టులో ఉండాల్సిందే.. స్పష్టం చేసిన రోహిత్

టీ - 20 వరల్డ్ కప్ నకు సెలెక్ట్ చేసే జట్టులో ఈసారి కోహ్లీ ఉండడని వార్తలు వినిపించాయి. అంతేకాదు ఈ ప్రపంచకప్ లో వెస్టిండీస్ లో కోహ్లీ బ్యాటింగ్ కు సరిపోని మైదానాలు ఉన్నాయి. అందుకే కోహ్లీని ఒప్పించి ఈసారి యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ సెక్రటరీ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కు చెప్పినట్టు తెలుస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 18, 2024 1:08 pm

Rohit Sharma

Follow us on

Rohit Sharma: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఆ మెగా టోర్నీ ముగిసిన తర్వాత టి20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. ఈసారి వరల్డ్ కప్ ను వెస్టిండీస్, అమెరికా నిర్వహిస్తున్నాయి. జూన్ 1 నుంచి ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. జూన్ 29న వెస్టిండీస్ లోని బార్బడోస్ లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మెగా టోర్నీలో కోహ్లీ ఆడాల్సిందేనని.. రోహిత్ శర్మ బీసీసీఐ సెలెక్ట్ కమిటీ కి స్పష్టం చేసినట్టు సమాచారం. ఒక స్పోర్ట్స్ నివేదిక ప్రకారం రోహిత్ శర్మ బీసీసీఐ సెక్రటరీ జై షా తో చర్చించినట్టు తెలుస్తోంది. విరాట్ ఎంపికపై తన వాదనను రోహిత్ శర్మ స్పష్టం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

టీ – 20 వరల్డ్ కప్ నకు సెలెక్ట్ చేసే జట్టులో ఈసారి కోహ్లీ ఉండడని వార్తలు వినిపించాయి. అంతేకాదు ఈ ప్రపంచకప్ లో వెస్టిండీస్ లో కోహ్లీ బ్యాటింగ్ కు సరిపోని మైదానాలు ఉన్నాయి. అందుకే కోహ్లీని ఒప్పించి ఈసారి యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ సెక్రటరీ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే కోహ్లీని ఒప్పించడంలో అజిత్ అగార్కర్ కు విఫలమయాడని తెలుస్తోంది. అందుకే జై షా ఈ బాధ్యతను టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అప్పగించినట్లు మాజీ ఆటగాడు కీర్తి ఆజాద్ తెలిపాడు.

జట్టు నుంచి కోహ్లీని పక్కన పెట్టేందుకు రోహిత్ శర్మ అంత ఆసక్తిగా లేడు. కోహ్లీకి ఎలాగైనా టి20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కల్పించాలని రోహిత్ శర్మ జై షా తో స్పష్టం చేశాడు. ఇక కీర్తి ఆజాద్ చెప్పిన దాని ప్రకారం వచ్చే టి20 ప్రపంచ కప్ లో కోహ్లీ ఆడతాడని తెలుస్తోంది. కాగా, జూన్ 1 నుంచి ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. ఈ పోరుకు జట్లను మే 1 నాటికి అన్ని మేనేజ్మెంట్లు ప్రకటించాలని ఐసీసీ గడుగు విధించింది. మార్చి చివరి నాటికి 20 దేశాలు తమ జట్ల వివరాలను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనికంటే ముందే విరాట్ కోహ్లీ టి20 ప్రపంచ కప్ లో ఆడతాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ బిసిసిఐ విరాట్ పేరు ప్రకటిస్తే.. రోహిత్, కోహ్లీ చివరి ప్రపంచ కప్ లో కలిసి ఆడతారు. ఈ కప్ ముగిసిన తర్వాత ఇద్దరు దిగ్గజాలు టి20 క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశం ఉన్నట్టు సమాచారం.