Kumari aunty counter to Bigg Boss Keerthi
Kumari Aunty: సోషల్ మీడియా సెన్సేషన్ కుమారి ఆంటీ గురించి తెలియని వారు ఉండరు. హైదరాబాద్ లో ఫుడ్ బిజినెస్ చేసుకునే కుమారి ఆంటీ పెద్ద సెలబ్రిటీ గా మారిపోయింది. పలువురు యూట్యూబర్స్ ఆమెను ఫేమస్ చేశారు. కుమారి ఆంటీ రీల్స్ వైరల్ అయ్యాయి. ఆమె చెప్పిన ‘రెండు లివర్లు ఎక్స్ట్రా .. మీది 1000 అయింది’ అనే డైలాగ్ విపరీతంగా ప్రాచుర్యం పొందింది. ఆమె పాపులారిటీ చూసి కుమారి ఆంటీ ఫుడ్ ఒక్క సారైనా టేస్ట్ చేయాలి అని జనం క్యూ కడుతున్నారు.
కాగా ఇటీవల కుమారి ఆంటీ క్రేజ్ చూసి ఆమెను కలవాలని సీరియల్ నటి కీర్తి భట్ వెళ్లారు. కుమారి ఆంటీ లేకపోవడంతో… ఎటూ వచ్చాం కదా అని ఫుడ్ టేస్ట్ చేసింది. ఫుడ్ అస్సలు బాగోలేదు. దీని కోసం జనాలు ఎందుకు ఎగబడుతున్నారో తెలియదు. చికెన్ చాలా కారంగా ఉంది. తినలేక దగ్గరలో ఉన్న వేరే ఫుడ్ స్టాల్ లో భోజనం చేసాము. అది బాగానే ఉంది. ఆమె కంటే చికెన్ నేనే బాగా చేస్తాను అంటూ కుమారి ఆంటీ ఫుడ్ పై నెగిటివ్ రివ్యూ ఇస్తూ వీడియో తీసి పెట్టింది.
కీర్తి వ్యాఖ్యల పై కుమారి ఆంటీ తాజాగా స్పందించింది. ఆమె వచ్చిన రోజు నేను ఊరెళ్ళాను. వంట నేను చేయలేదు. మగవాళ్ళు చేసిన వంటకు ఆడవాళ్లు చేసిన వంటకు తేడా ఉంటుంది కదా. కీర్తి భట్ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఎవరి అభిప్రాయం వాళ్ళది. నా ఫుడ్ బాగాలేదు అన్నంత మాత్రాన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడను. అందరికీ నా ఫుడ్ నచ్చాలని లేదు. కొందరికి నచ్చుతుంది.
మరి కొందరికి నచ్చదు అని కుమారి ఆంటీ అన్నారు. తన వ్యాపారం దెబ్బ తీసేలా కీర్తి భట్ వ్యాఖ్యలు ఉన్నప్పటికీ కుమారి ఆంటీ ఎంత మాత్రం నోరు జారలేదు. చాలా కూల్ గా తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది. కుమారి ఆంటీ తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇప్పుడు కుమారి ఆంటీ రేంజ్ వేరే లెవెల్ లో ఉంది. మొన్నటి వరకు షో లకు స్పెషల్ గెస్ట్ గా వెళ్ళి సందడి చేసింది. కుమారి ఆంటీ కొన్ని సీరియల్స్ లో నటిస్తున్నట్లు సమాచారం.