Homeక్రీడలుక్రికెట్‌RCB vs SRH 2026 Live Updates: అభిషేక్, శర్మ, హెడ్, నితీష్ ఇలా చేశారేంటి.....

RCB vs SRH 2026 Live Updates: అభిషేక్, శర్మ, హెడ్, నితీష్ ఇలా చేశారేంటి.. పాపం కావ్య పాప

RCB vs SRH 2026 Live Updates: ఐపీఎల్ మొదలైంది. 2026 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బెంగళూరు బౌలింగ్ మొదలుపెట్టింది. భారీగా వచ్చిన అభిమానుల సమక్షంలో మొదలైన మ్యాచ్.. రికార్డు స్థాయిలో వీయర్ షిప్ నమోదు చేస్తోంది. ఇప్పటికే 12+ కోట్లకు పైగా వ్యూయర్స్ లైవ్ లో చూస్తున్నారు.. మ్యాచ్ ప్రారంభానికి ముందు.. గత ఏడాది ప్రాణాలు కోల్పోయిన 11 మందికి స్మృత్యర్థం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. 11 సీట్లను ఖాళీగా ఉంటారు. ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఇరుజట్ల ప్లేయర్లు ఆలపించారు.

Also Read: అక్కా.. కేసులు వెనక్కి తీసుకో.. పాపం రేవంత్ రెడ్డిది మామూలు బాధ కాదు పో..

ఈ పిచ్ మీద బంతి ఎక్స్ ట్రా బౌన్స్ అవుతోంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన అభిషేక్ శర్మ.. తొలి ఓవర్ వేసిన డఫీ బౌలింగ్లో సిక్సర్ కొట్టాడు. ఐపీఎల్ లో ఈ సీజన్లో తొలి సిక్సర్ కొట్టిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. దీంతో హైదరాబాద్ జట్టు భారీగా పరుగులు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ బెంగళూరు బౌలర్లు మరో విధంగా స్క్రిప్ట్ రూపొందించారు. హైదరాబాద్ ఓపెనర్ల బలహీనతలను గుర్తించి.. అదే స్థాయిలో బంతులు వేశారు. భువనేశ్వర్ కుమార్ 9 పరుగులు ఇచ్చాడు. డఫీ రెండో ఓవర్లో.. ఎక్స్ ట్రా బౌన్స్ వేసి అభిషేక్ శర్మ ను బోల్తా కొట్టించాడు. 8 బంతుల్లో ఏడు పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. సాల్ట్ పట్టిన క్యాచ్ తో ఔట్ అయ్యాడు.

ఇదే ఓవర్లో హెడ్ కూడా అవుట్ అయ్యాడు. డఫీ బౌలింగ్లో 4 కొట్టి సౌకర్యవంతంగా కనిపించిన హెడ్.. జితేష్ శర్మ పట్టిన క్యాచ్ ద్వారా పెవిలియన్ చేరుకున్నాడు. పవర్ ప్లే కూడా పూర్తిగా ముందే ఇద్దరు ఓపెనర్లు అవుట్ కావడానికి హైదరాబాద్ జట్టు యజమాని కావ్య జీర్ణించుకోలేకపోయింది. ఇద్దరు ఓపెనర్లు, నితీష్ కుమార్ రెడ్డి అవుట్ కావడంతో ఒక్కసారిగా అప్సెట్ అయిపోయింది. మైదానంలో కెమెరా మెన్లు మొత్తం ఆమెనే చూపించారు.

ఈ మ్యాచ్లో బెంగళూరులో హేజిల్ వుడ్ లేడు. డఫీ, భువనేశ్వర్ కుమార్ పేస్ బాధ్యతలను భుజాలకు ఎత్తుకున్నారు. కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేసి చూపించారు. భువనేశ్వర్ కుమార్ ఎక్స్ ట్రా లు వేసినప్పటికీ.. డఫీ కట్టుదిట్టంగా బంతులు వేశాడు. మూడు ఓవర్లు వేసి 13 పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా తను ఎంత ప్రమాదకరమైన బౌలరో ప్రత్యర్థులకు సంకేతాలు పంపించాడు. భువనేశ్వర్ కుమార్ కూడా అదే స్థాయిలో బౌలింగ్ వేసాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న నితీష్ కుమార్ రెడ్డి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఎక్స్ ట్రా బౌన్స్ ను అంచనా వేయలేక భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బంతి గాల్లో లేచింది. ఫీల్డర్ చేతిలోకి నేరుగా వెళ్లిపోయింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular