https://oktelugu.com/

Pushpa: ‘పుష్ప’ ఫస్ట్​ఆఫ్​లోనే సమంత ఐటెం సాంగ్​.. కారణం అదేనట?

Pushpa: అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘పుష్ప’. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. నిన్ననే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కాగా దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం ముంబై వెళ్లడంతో ఈవెంట్ కు హాజరు కాలేకపోయారు. కాగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 14, 2021 / 10:11 AM IST
    Follow us on

    Pushpa: అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘పుష్ప’. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. నిన్ననే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కాగా దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం ముంబై వెళ్లడంతో ఈవెంట్ కు హాజరు కాలేకపోయారు.

    కాగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. అలానే సినిమాలో పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్ గా సమంత నటించిన ఐటెం నెంబర్ ‘ఊ అంటావా మావా ఊహూ అంటావా’ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. విడుదలైన కొద్ది గంటల్లోనే  సౌంత్​ఇండియాలోనే మోస్ట్​ వ్యూడ్​ సాంగ్​గా రికార్డు నెలకొల్పింది. మిలియన్ల వ్యూస్​తో దూసుకెళ్లిపోతోంది. ఇందులో బన్నీ, సమంత స్టెప్పులు ఇరగదీశారని మేకర్స్ చెబుతున్నారు.

    అయితే, ఈ సినిమాలో సెకండ్​ ఆఫ్​లో భారీ యాక్షన్​ సీన్లు ఉండటం వల్ల ఐటెం సాంగ్​ను ఫస్ట్​ ఆఫ్​లోనే పెట్టారట సుకుమార్​. దట్టమైన అటవీ ప్రాంతంలో బైక్​ చేజ్​ ఎపిసోడ్​ను భారీ యాక్షన్​గా చిత్రీకరించినట్లు సమాచారం. సినిమాకు ఇదే హైలెట్​గా నిలవనుందట. ఫైట్​ మాస్టర్​ పీటర్​ హెయిన్స్ దీన్ని కంపోజ్​ చేశారు. ఇందులో అనసూయ, సునీల్​ మేకోవర్​ ప్రేక్షకులను మెస్మరైజ్​ చేస్తుందని.. ఫహద్​ ఫాజిల్ అద్భుతంగా నటించారని ఇండస్ట్రీలో ప్రచారం నడుస్తోంది. ఇన్ని భారీ అంచనాల నడుమ డిసెంబరు 17న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.