https://oktelugu.com/

RCB: పాయింట్ల పట్టికలో ఆర్సీబీ టాప్.. ఈ సాలా కప్ నమ్‌దే

RCB రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 4 పాయింట్లను సాధించి +2.266 నెట్‍ రన్‍రేట్‍తో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. కోల్‍కతాపై ఏడు వికెట్లు తేడాతో, చెన్నైపై 50 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలవడంతో రన్‌రేట్ ఎక్కువగా ఉండి.

Written By: , Updated On : March 30, 2025 / 11:59 AM IST
RCB

RCB

Follow us on

RCB: ఇండియన్ ప్రీమియల్ లీగ్‌ 18వ సీజన్ ప్రస్తుతం జరుగుతోంది. మొత్తం 10 జట్లు ఇందులో ఆడుతున్నాయి. అయితే ఇప్పటికి అన్ని జట్లు ఆడాయి. ఈ సీజన్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొడుతుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. యంగ్ ప్లేయర్ రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ వరుస రెండు మ్యాచ్‌లు గెలిచింది. మొదటి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‍కతా నైట్‍రైడర్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఈజీగా కోల్‌కతా జట్టును ఓడించింది. ఆ తర్వాత మార్చి 28వ తేదీన చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఆర్సీబీ సీఎస్‌కేపై గెలిచింది. దాదాపుగా 17 ఏళ్ల తర్వాత బెంగళూరు జట్టు సొంత గడ్డపై చెన్నైని ఓడించింది. వరుసగా రెండు మ్యాచ్‌లలో గెలిచి పాయింట్ల పట్టికలో ఆర్సీబీ టాప్‌లో ఉంది. దీంతో ఈసారి ఆర్సీబీ కప్ గెలవడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు. ఆర్సీబీ జట్టు ఇదే దూకుడుతో ఆడితే మాత్రం తప్పకుండా ఛాంపియన్స్ కావడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 4 పాయింట్లను సాధించి +2.266 నెట్‍ రన్‍రేట్‍తో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. కోల్‍కతాపై ఏడు వికెట్లు తేడాతో, చెన్నైపై 50 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలవడంతో రన్‌రేట్ ఎక్కువగా ఉండి.. టాప్ ప్లేస్‌లో ఉంది. సెకండ్ ప్లేస్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఉంది. రెండు మ్యాచ్‌లలో ఒక మ్యాచ్ గెలిచి 0.963 నెట్‍ రన్‍రేట్‌తో రెండో స్థానంలో ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ మూడో స్థానంలో ఉంది. ఒక మ్యాచ్ ఆడగా.. గెలిచి 0.550 నెట్ రన్‍రేట్‌తో మూడో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ మ్యాచ్‍లో విజయం సాధించి 2 పాయింట్లతో 0.371 నెట్ రన్‍రేట్‍తో నాలుగో స్థానంలో ఉంది. సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండు మ్యాచ్‌లలో ఒకదాంట్లో ఓడిపోయింది. ఇక పాయింట్ల టేబుల్‌లో రెండు పాయింట్లతో -0.128 మైనస్ నెట్ రన్‍రేట్‌తో ఐదో స్థానంలో ఉంది. కోల్‍కతా ఒక మ్యాచ్ గెలిచి ఆరో ప్లేస్‌లో -0.308 నెట్ రన్‍రేట్‌తో ఉంది. చెన్నై జట్టు ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. రెండో మ్యాచ్ ఓడిపోవడంతో 2 పాయింట్లతో -1.013 నెట్ రన్‍రేట్‍తో ఏడో స్థానంలో ఉంది. ఒక మ్యాచ్‍లో ఆడి ఓడిన ముంబై ఇండియన్స్ -0.493, గుజరాత్ టైటాన్స్ -0.550 ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉంది. రెండు మ్యాచ్‍ల్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు -1.822 నెగెటివ్ నెట్‍ రన్‍రేట్‍తో పదో స్థానంలో ఉంది.